అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్ కోసం థియేటర్లు ముస్తాబు అవుతుండేవి. ఓవర్సీస్‌లో మరి కొన్ని గంటల్లో ప్రిమియర్స్ కూడా మొదలైపోయేవి. విజయ్ చివరి చిత్రం కావడంతో ‘జననాయగన్’కు సెన్సేషనల్ ఓపెనింగ్స్ వచ్చుండేవి. బాక్సాఫీస్ షేక్ అయిపోయేది. కానీ సెన్సార్ సమస్యలతో ఈ సినిమా రిలీజ్ అనూహ్యంగా ఆగిపోయింది.
వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లగా.. రేపు ఉదయమే తీర్పు వెలువురించాల్సి ఉండడంతో రిలీజ్ వాయిదా వేయడం అనివార్యమైంది. దీని వల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మామూలు ఇబ్బంది తలెత్తలేదు. విదేశాల్లో కొన్ని వారాల ముందే బుకింగ్స్ మొదలుపెట్టారు. భారీ స్థాయిలో టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఇండియాలో కూడా కొన్ని రోజుల కిందట బుకింగ్స్ మొదలుపెట్టారు. సినిమాకు సెన్సార్ కాకముందే పెద్ద ఎత్తున టికెట్లు అమ్మారు.
కానీ ‘జననాయగన్’ అనూహ్యంగా వాయిదా పడిపోవడంతో అమ్మిన టికెట్లన్నీ రద్దయిపోయాయి. తమిళనాడులో పూర్తి స్థాయిలో టికెట్ల అమ్మకం మొదలు కాకపోయినా.. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ జరగకపోయినా.. వరల్డ్ వైడ్ ‘జననాయగన్’కు రూ.60 కోట్ల మేర అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం విశేషం.
ఒక్క ఉత్తర అమెరికాలో మాత్రమే ఈ సినిమా ప్రి సేల్స్‌తోనే 4.2 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. ఇంకా పలు దేశాల్లో పెద్ద ఎత్తున టికెట్ల అమ్మకాలు జరిగాయి. ఈ సినిమా వాయిదా అని తేలడానికి ముందు వరల్డ్ వైడ్ ప్రి సేల్స్ మొత్తం రూ.60 కోట్లకు చేరింది.
నిన్న రాత్రి చిత్ర నిర్మాణ సంస్థ సినిమా వాయిదా అని ప్రకటించగానే టికెట్లు అన్నీ క్యాన్సిల్ చేసి ఈ రూ.60 కోట్ల రీఫండ్ మొదలుపెట్టాయి వరల్డ్ వైడ్ థియేటర్ ఛైన్స్. ఈ స్థాయిలో టికెట్లు అమ్మి.. రిలీజ్ కోసం పెద్ద ఎత్తున థియేటర్లు సిద్ధం చేసి, అన్ని ఏర్పాట్లూ చేశాక ఇలా సినిమా వాయిదా పడడం, రీఫండ్స్ ఇవ్వడం ఎంత ఇబ్బందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దీని వల్ల నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు నష్టం భారీగానే ఉంటుంది. సినిమాకు మళ్లీ ఇంత మంచి డేట్ దొరుకుతుందా.. బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులు ఉంటాయా.. అప్పుడు ప్రేక్షకుల నుంచి ఈ స్థాయి రెస్పాన్స్ ఉంటుందా అన్నది సందేహమే.
This post was last modified on January 8, 2026 2:10 pm
ప్రపంచవ్యాప్తంగా విజయ్ అభిమానులను తీవ్ర మనస్థాపానికి గురి చేసిన జన నాయకుడు సెన్సార్ వివాదం ఒక కొలిక్కి వచ్చేసింది. యు/ఏ…
వెండితెరకు చాలా గ్యాప్ తీసుకున్న సమంత త్వరలో మా ఇంటి బంగారంతో కంబ్యాక్ అవుతోంది. జీవిత భాగస్వామి రాజ్ నిడిమోరు…
ప్రభాస్ అభిమానుల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ రాజా సాబ్ థియేటర్లలో అడుగు పెట్టేశాడు. టాక్స్, రివ్యూస్ సంగతి కాసేపు…
ఏ రాష్ట్రంలో అయినా... ప్రతిపక్ష నాయకులకు ప్రభుత్వాలు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వవు. సహజంగా రాజకీయ వైరాన్ని కొనసాగిస్తాయి. ఏపీ సహా…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. పార్టీలకు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. శుక్రవారం నుంచి…