ఆడియో వేడుకలో హీరో తల్లి పాట పాడితే…

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ చివరి సినిమా ‘జననాయగన్’ ఇంకో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూడు దశాబ్దాలకు పైగా తమను అలరిస్తున్న విజయ్.. ఈ సినిమాతో రిటైర్మెంట్ తీసుకోబోతుండడం అభిమానులను తీవ్ర భావోద్వేగానికి గురి చేస్తోంది.

మలేషియాలో గత వారం జరిగిన ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుక ఫ్యాన్స్‌ను కదిలించేసింది. అందులో ఎన్నో ఎమోషనల్ మూమెంట్స్ కనిపించాయి. ఈ వేడుకను తాజాగా టీవీ ఛానెల్లో ప్రసారం చేశారు. ఇందులో ఒక బ్యూటిఫుల్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వేడుకకు విజయ్ తల్లిదండ్రులు శోభ, చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. ఈ వేడుకలో విజయ్ తల్లి సింగర్‌గా మారి పెర్ఫామ్ చేయడం విశేషం. ఆమె మైక్ పట్టుకుని ప్రొఫెషనల్ సింగర్లతో కలిసి ఒక పాట పాడారు. ఒకట్రెండు లైన్లు పాడి వదిలేయడం కాదు.. మొత్తం పాటను ఆలపించారు శోభ.

ఐతే శోభ పాట పాడడం మొదలుపెట్టగానే ఆడిటోరియం దద్దరిల్లిపోగా.. ఆమె ఎవరో తెలియని హీరోయిన్ పూజా హెగ్డే, అంత రెస్పాన్స్ ఎందుకు వచ్చిందా అని ఆశ్చర్యపోయింది. పక్కనే ఉన్న విజయ్.. పూజాను పిలిచి, పాట పాడుతోంది తన తల్లి అని చెప్పాడు.

దీంతో పూజా ఆశ్చర్యంగా ఆమెను పాటను వినడం మొదలుపెట్టింది. ఇలా ఒక అగ్ర కథానాయకుడి సినిమా ఆడియో వేడుకలో తల్లి పాట పాటడం అన్నది అరుదైన దృశ్యమే. పైగా ఇది విజయ్ చివరి చిత్రం కావడంతో ఆ మూమెంట్ ఇంకా స్పెషల్‌గా మారింది. అందుకే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.