తమిళంలో కొన్నేళ్లుగా నంబర్‌వన్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న విజయ్.. జననాయగన్ చిత్రంతో సినిమాలకు వీడ్కోలు పలుకుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ టీవీకేను బరిలోకి నిలుపుతున్న విజయ్.. ఇకపై సినిమాలు చేయననేశాడు. ప్రస్తుతానికి జననాయగన్‌యే తన చివరి చిత్రం. సంక్రాంతి కానుకగా ఈ నెల 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి పోటీగా తర్వాతి రోజు శివకార్తికేయన్ మూవీ పరాశక్తి రిలీజ్ కాబోతోంది. ఐతే ఒకప్పుడు విజయ్ అభిమానిగా చెప్పుకున్న శివకార్తికేయన్.. విజయ్ చివరి చిత్రానికి పోటీగా సంక్రాంతి బరిలో తన సినిమాను నిలబెట్టడం చర్చనీయాంశంగా మారింది.
విజయ్ మీద అభిమానంతో తన లాస్ట్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలో ఒక క్యామిమో రోల్ కూడా చేశాడు శివ. అలాంటిది ఇప్పుడు విజయ్‌తో క్లాష్‌కు రెడీ అవడం తన అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. వాళ్లు అతడి మీద మండిపడుతుండగా.. విజయ్ అంటే పడని వేరే హీరోల ఫ్యాన్స్, అలాగే శివకార్తికేయన్ అభిమానులు అతడికి మద్దతుగా నిలుస్తున్నారు. ముందు ఈ చిత్రాన్ని 14న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత 10కి డేట్ మార్చారు. ఇది విజయ్ అభిమానులకు రుచించలేదు. థియేటర్ల అగ్రిమెంట్ విషయంలో రెండు సినిమాల నిర్మాతల మధ్య గొడవ కూడా నడుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఐతే తన పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న విజయ్ అభిమానులను పరాశక్తి ఆడియో వేడుకలో శివ కార్తికేయన కూల్ చేసేశాడు. విజయ్‌ని అన్న అని సంబోధిస్తూ అతడి మీద తన అభిమానమంతా చూపించేశాడు విజయ్. ముందు తమ సినిమాను దీపావళికి అనుకున్నామని.. కానీ జననాయగన్ చిత్రాన్ని ఆ పండక్కే రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో తమ మూవీని సంక్రాంతికి మార్చుకున్నట్లు శివ తెలిపాడు. కానీ తర్వాత విజయ్ మూవీ సంక్రాంతికి వచ్చిందని.. దీని గురించి తమ నిర్మాతతో మాట్లాడితే.. బయ్యర్లు మళ్లీ డేట్ మార్చడానికి ఒప్పుకోరని, సినిమాకు చాలా ఇబ్బంది అవుతుందని అనడంతో తాను ఏమీ చేయలేకపోయానని చెప్పాడు.
సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేసుకునే వీలుందన్న ఉద్దేశంతోనే తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామని.. అంతే తప్ప విజయ్ మూవీకి తమ చిత్రం పోటీ కాదని అతనన్నాడు. అన్నాతమ్ముడు కలిసి పొంగల్‌కు వస్తున్నారని.. దీన్ని ఎవరైనా కాదనగలరా అని శివ పేర్కొనడంతో విజయ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇంతటితో వివాదం సద్దుమణిగినట్లే అని భావిస్తున్నారు.
This post was last modified on January 5, 2026 7:37 am
గత రెండు రోజులుగా ఇటు సోషల్ మీడియాలోను, అటు ప్రధాన మీడియా ఛానెళ్లలోను.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. ప్రపంచ…
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…