మోహన్ లాల్ తల్లి శాంతకుమారి అనారోగ్య సమస్యలతో మరణించారు. ఆమె వయసు 90 ఏళ్లు. శాంతకుమారి కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. కొంత కాలంగా ఆమె మంచానికే పరిమితం అయ్యారు. కోచిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ ఇంటిలోనే శాంతకుమారి తుది శ్వాస విడిచారు. శాంతకుమారి సొంత ఊరు ఎలంతూర్ కాగా.. పెళ్లి తర్వాత భర్తతో కలిసి తిరువనంతపురంలో స్థిరపడ్డారు.
ఉన్నత విద్యావంతురాలైన ఆమె.. కేరళ ప్రభుత్వ న్యాయ కార్యదర్శిగా పని చేయడం విశేషం. అనారోగ్యం పాలయ్యాక తల్లిని మోహన్ లాల్ కోచిలో తన ఇంటికి తీసుకొచ్చారు. అక్కడే ఉంచి ఆమెను జాగ్రత్తగా చూసుకుంటున్నారు. తల్లి మరణం నేపథ్యంలో తాను చిన్నపిల్లాడిగా ఉండగా ఆమెతో కలిసి తీయించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో మోహన్ లాల్ పంచుకున్నారు.
‘అమ్మ’ అనే కామెంట్‌కు లవ్ ఎమోజీ జోడించి పోస్టు పెట్టారు.
ఏ వయసులో అయినా సరే తల్లి మరణం ఓ వ్యక్తికి తీవ్ర భావోద్వేగానికి గురి చేసేదే. ఈ నేపథ్యంలో మోహన్ లాల్‌కు సామాజిక మాధ్యమాల్లో సానుభూతి సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. దేశం గర్వించదగ్గ నటుడిని అందించిన శాంతకుమారిని అందరూ కొనియాడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates