క్రిస్మస్ సినిమాల సందడి నెమ్మదించేసింది. శంబాల అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోగా టాక్, రివ్యూస్ తో సంబంధం లేకుండా ఈషా కూడా గట్టెక్కేసింది. నిర్మాణ సంస్థ చెబుతున్న దాని ప్రకారం ఛాంపియన్ మొదటి వీకెండ్ ని పదకొండు కోట్లకు పైగా వసూళ్లతో ముగించినప్పటికీ హిట్ స్టేటస్ తెచ్చుకునేందుకు అది సరిపోదని వీక్ డేస్ డ్రాప్ ఋజువు చేస్తున్నాయి.
అఖండ 2 లాగా మళ్ళీ సెలవులు వస్తే పికప్ అయ్యేంత రేంజ్ శంబాల, ఈషాకు లేవు. రెండో వారంలో మెయిన్ సెంటర్స్ లో ఎలాగూ కొనసాగుతాయి కాబట్టి ఇంకొన్ని నెంబర్లు తోడవ్వడం బయ్యర్ల కోణంలో మంచిదే. ఇక అందరి చూపు జనవరి 1 వైపు వెళ్తోంది.
నందు హీరోగా రూపొందిన సైక్ సిద్దార్థ సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా విడుదలవుతోంది. తీసింది నిర్మాత సురేష్ బాబు కాకపోయినా అవుట్ ఫుట్ చూసి మరీ రిలీజ్ చేసేందుకు ముందుకొచ్చారు. కంటెంట్ క్రేజీగా ఉంది. అమ్మాయితో బ్రేకప్ చేసుకున్న ఒక విచ్చలవిడి అబ్బాయి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా దర్శకుడు వరుణ్ రెడ్డి దీన్ని తెరకెక్కించినట్టు కనిపిస్తోంది.
హోమ్లీగా ఉండే పక్కింటి అమ్మాయిని ఈ కుర్రాడు ఎలా ప్రేమలో పడేశాడనే సబ్ ప్లాట్ కూడా ఇందులో ఉంది. చాలా కాలం తర్వాత నందు ఫుల్ ఎనర్జీతో వయసు వెనక్కు వెళ్లినట్టు కష్టపడి మేకోవర్ చేసుకుని మరీ నటించాడు.
నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ అవుతున్న వాటిలో చెప్పుకోదగ్గ మూవీ సైక్ సిద్దార్థ ఒకటే. వేరేవి ఉన్నాయి కానీ బజ్ సృష్టించుకోవడంలో తడబడుతున్నాయి. ఈ అవకాశాన్ని కనక నందు వాడుకుంటే వారం రోజులు వసూళ్లకు ఢోకా ఉండదు. జనవరి 9 రాజా సాబ్ వచ్చేదాకా థియేటర్ ఫీడింగ్ కి సైక్ సిద్దార్థ మంచి ఆప్షన్ అవుతుంది.
కంటెంట్ బాగుందని అనిపించుకున్నా చాలు బ్రేక్ ఈవెనే కాదు లాభాలు కూడా వచ్చి పడతాయి. పతంగ్ ని ఓవర్ కాంపిటీషన్ లో దింపి పొరపాటు చేసిన సురేష్ డిస్ట్రిబ్యూషన్ కి ఈసారి అలాంటి సమస్య లేదు. కావాల్సిందల్లా సైక్ సిద్దార్థ జస్ట్ బాగానే ఉందనే మాట అనిపించుకోవడం.
Gulte Telugu Telugu Political and Movie News Updates