ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి స్టేజ్ మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం, ఛాలెంజ్‌లు చేయడం ఇప్పుడు ట్రెండ్‌గా మారిపోయింది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతుండడం.. ఏ సినిమా కోసం థియేటర్లకు వెళ్లాలనే విషయంలో ప్రేక్షకులు సెలక్టివ్‌గా ఉంటుండడంతో వారిలో క్యూరియాసిటీ పెంచడానికి సెన్సేషనల్ స్టేట్మెంట్లు ఇవ్వడం, ఛాలెంజ్‌లు చేయడం మామూలైపోయింది.
ఐతే ఈ క్రమంలో ఫిలిం సెలబ్రెటీలు మరీ అదుపు తప్పి మాట్లాడేస్తున్నారు. అయినా చిన్న సినిమాల మేకర్స్ తమ చిత్రం ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు ఇలా చేసినా దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ రాజాసాబ్ లాంటి భారీ చిత్రం గురించి కమెడియన్ సప్తగిరి ఇచ్చిన స్టేట్మెంటే మరీ విడ్డూరంగా అనిపిస్తోంది. శనివారం హైదరాబాద్ వేదికగా రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.
రాజాసాబ్‌లో కమెడియన్‌గా నటించిన సప్తగిరి ఈ వేడుకలో స్పీచ్ ఇచ్చాడు. ఆ సందర్భంగా అతను పెద్ద ఛాలెంజే చేశాడు. ఈ సినిమా 2 వేల కోట్ల రూపాయలు వసూలు చేయడం ఖాయమని.. అది రాసి పెట్టుకోవాలని.. ఒక వేళ అలా జరగకపోతే ఆ డబ్బులు తాను ఇస్తానని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేశాడు సప్తగిరి. కానీ ప్రభాస్ సినిమా అంటే వసూళ్లు భారీగానే వస్తాయి కానీ.. మరీ రూ.2 వేల కోట్ల కలెక్షన్లు రాబట్టడం అంటే చిన్న విషయం కాదు.
బాహుబలి-2కే ఆ ఘనత సాధ్యం కాలేదు. ఆ సినిమా తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ప్రభాస్ సినిమా కల్కినే. అది రూ.1100 కోట్లు రాబట్టింది. సంక్రాంతికి విపరీతమైన పోటీలో వస్తున్న రాజాసాబ్ వెయ్యి కోట్లు సాధించినా గొప్పే. మరి ఏ ధీమాతో సప్తగిరి ఈ మాట అన్నాడో మరి? ఆ సినిమా అంత కలెక్ట్ చేయకపోతే తాను ఆ డబ్బులు ఇస్తా అనడం మరీ విడ్డూరం.
మరి అన్ని డబ్బులు సప్తగిరికి ఎక్కడి నుంచి వస్తాయి? చిన్న సినిమాల మేకర్స్ జనాల దృష్టిని ఆకర్షించడం కోసం టూమచ్ అనిపించే స్టేట్మెంట్లు ఇస్తే ఓకే కానీ.. రాజాసాబ్ లాంటి పెద్ద సినిమా గురించి ఇలాంటి ఛాలెంజులు విసిరితే.. రేప్పొద్దున సినిమా అటు ఇటు అయితే అనవసరంగా ప్రభాస్ ట్రోల్ అవుతాడు సోషల్ మీడియాలో. ఇక తన స్పీచ్‌లో భాగంగా ప్రభాసే ఈ సినిమాలో అతి పెద్ద కమెడియన్ అంటూ సప్తగిరి చేసిన వ్యాఖ్య కూడా అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates