తుపాకి సినిమాతో మురుగదాస్, విజయ్‌లది బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది తమిళంలో. ఆ సినిమా తెలుగులోనూ విడుదలై మంచి విజయమే సాధించింది. వీళ్లిద్దరూ కలిసి చేసిన రెండో సినిమా కత్తి ఇంకా పెద్ద బ్లాక్‌బస్టర్ అయింది. అప్పటికి తమిళంలో వసూళ్ల రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసింది. కానీ వీరి కలయికలో వచ్చిన మూడో సినిమా సర్కార్ మాత్రం తుస్సుమనిపించింది.
దాని కంటే ముందు స్పైడర్‌తో బోల్తా కొట్టిన మురుగదాస్.. సర్కార్‌తోనూ పుంజుకోలేకపోయాడు. ఆ తర్వాత అతను తీసిన దర్బార్ సైతం నిరాశపరిచింది. అయినా సరే.. మురుగదాస్‌ను నమ్మి సన్ పిక్చర్స్ బేనర్లో ఓ సినిమా చేయడానికి విజయ్ రెడీ అయ్యాడు. కానీ హీరోను, నిర్మాతలను మెప్పించే కథను మురుగదాస్ తయారు చేయలేకపోయాడని, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి అతను తప్పుకోవాల్సి వచ్చిందని ఆ మధ్య వార్తలొచ్చాయి.
ఇప్పుడు ఆ వార్తే నిజమని తేలింది. విజయ్ హీరోగా సన్ పిక్చర్స్ వేరే దర్శకుడితో సినిమాను అనౌన్స్ చేసింది. ఆ దర్శకుడి పేరు నెల్సన్ దిలీప్‌కుమార్. విజయ్ రేంజికి ఇతను చాలా చిన్న దర్శకుడిగానే చెప్పాలి. నెల్సన్ సినిమా ఇప్పటిదాకా ఒక్కటే విడుదలైంది. అదే.. కోలమావు కోకిల. నయనతార ప్రధాన పాత్ర పోషించిన ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీ మంచి విజయం సాధించింది. ఆ చిత్రం తెలుగులో కొకో కోకిల పేరుతో విడుదలై పర్వాలేదనిపించింది.
ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా డాక్టర్ అనే సినిమా తీస్తున్నాడు నెల్సన్. ఇంతలోనే విజయ్ లాంటి సూపర్ స్టార్‌తో సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు. విజయ్ ఈ మధ్య ఇలాగే తక్కువ అనుభవం ఉన్న, చిన్న స్థాయి దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. రెండు సినిమాల అనుభవమున్న లోకేష్ కనకరాజ్‌తో అతను మాస్టర్ అనే సినిమా చేశాడు. అది విడుదలకు సిద్ధంగా ఉంది. దీని తర్వాత నెల్సన్ దర్శకత్వంలోనే అతను నటించనున్నాడు.
This post was last modified on December 10, 2020 10:04 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…