అఖండ 2… ఆక్సిజన్ ఇచ్చిన ఆదివారం

మాములుగా ఎంత స్టార్ హీరో అయినా ఫ్లాప్ టాక్ వస్తే నిలదొక్కుపోవడం చాలా కష్టం. కానీ అఖండ తాండవం 2కి ఇది ఇంకోలా జరిగింది. శని ఆదివారం బుకింగ్స్ అనూహ్యంగా పెరిగాయి. రెగ్యులర్ గా బుక్ మై షో ట్రెండింగ్ లో ఉన్నప్పటికీ వీక్ డేస్ లో చాలా చోట్ల ఆక్యుపెన్సీలు తగ్గిపోయాయి. కానీ ఈ రెండు రోజులు ఆక్సీజన్ అయ్యాయి. దీంతో వంద కోట్ల గ్రాస్ ని సునాయాసంగా దాటేయడమే కాక మంచి నెంబర్లే నమోదు కానున్నాయి. అయితే నిర్మాతలు వాటిని అధికారికంగా రిలీజ్ చేస్తారా లేదానేది చూడాలి. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ ఇంకా దూరం ఉన్న నేపథ్యంలో లేనిపోని అంకెలు చూపిస్తే బయ్యర్ల నుంచి ఇబ్బందులు తలెత్తొచ్చు.

అవతార్ ఫైర్ అండ్ యష్ కలెక్షన్లు బాగున్నప్పటికీ మిక్స్డ్ రెస్పాన్స్ రావడం అఖండ 2కి ప్లస్ అయ్యింది. లేదంటే ఫ్యామిలీస్ దానికి వెళ్ళేవాళ్ళు. దురంధర్ జోరు తగ్గనప్పటికీ ఏపీ తెలంగాణలో పరిమిత స్క్రీన్ కౌంట్ వల్ల హౌస్ ఫుల్స్ పడితే మరిన్ని షోలు జోడించే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆ అడ్వాంటేజ్ కూడా అఖండ 2నే వాడుకుంటున్నాడు. ఇంకో రెండు మూడు రోజుల్లో రాయలసీమలో సక్సెస్ మీట్ చేసే ప్లానింగ్ ప్రస్తుతం జరుగుతోంది. క్రిస్మస్ సెలవులు, దగ్గరలో న్యూ ఇయర్ సందర్భాలను క్యాష్ చేసుకోవడం కోసం అఖండ 2 పబ్లిసిటీ వేగం పెంచబోతున్నారు.

అభిమానులు సంతోషించాల్సిన విషయం ఏంటంటే మెయిన్ సెంటర్స్ చాలా షోలు సండే రోజు హౌస్ ఫుల్ అయ్యాయి. థియేటర్ కు వెళ్లాలంటే వేరే ఆప్షన్లు లేకపోవడంతో బాలయ్యకు మరో ఛాన్స్ దొరికింది. మోగ్లీని ఎంత ప్రమోట్ చేసిన ఆడియన్స్ నిర్మొహమాటంగా రిజక్ట్ చేయడంతో వారాంతంలోనూ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. ఇక రేపటి నుంచి అఖండ 2 నుంచి ఎలాంటి అద్భుతాలు జరగకపోవచ్చు. డిసెంబర్ 25 పది దాకా కొత్త రిలీజులు ఉన్నాయి. వాటిలో రెండు మూడు మంచి టాక్ తెచ్చుకున్నా ఆపై వీకెండ్ ని తమ కంట్రోల్ లోకి తీసుకుంటాయి. అక్కడితో కథ సుఖాంతమవుతుంది. చూద్దాం.