గత పదేళ్లలో దక్షిణాది నుంచి వచ్చిన ఉత్తమ నటుల్లో విజయ్ సేతుపతి పేరు ముందుగా చెప్పుకోవాలి. ముందు క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్‌తో ప్రస్థానం మొదలుపెట్టిన విజయ్ సేతుపతి.. ఆ తర్వాత హీరోగా కూడా రాణించాడు. ఐతే ఎప్పుడూ ఒక మూసలో సినిమాలు, పాత్రలు చేయడం అతడికి అలవాటు లేదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. లుక్స్ పరంగా చాలా యావరేజ్‌గా కనిపించే అతను.. నటుడిగా చూపించే వైవిధ్యం అందరినీ కట్టిపడేస్తుంటుంది.
తమిళ సినిమాలతోనే అతను వేరే భాషల వాళ్లను కూడా ఆకట్టుకున్నాడు. అన్ని భాషల వాళ్లకూ అతను తెలుసు. ఈ క్రమంలోనే తెలుగులో సైరా నరసింహారెడ్డి, ఉప్పెన లాంటి సినిమాల్లోనూ కీలక పాత్రలు చేశాడు. ఐతే అల్లు అర్జున్-సుకుమార్‌ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’లోనూ విలన్ పాత్రకు అతణ్నే అనుకున్నారు కానీ.. ఆ సినిమా కోసం అతను డేట్లు సర్దుబాటు చేయలేకపోయాడు.
వేరే సినిమాలు వదులుకుని అయిన ‘పుష్ప’ చిత్రాన్ని విజయ్ సేతుపతి చేయాల్సిందని చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ అతనెందుకు ఈ సినిమాను అంత సీరియస్‌గా తీసుకోలేదో తెలియడం లేదు. కాగా ఇప్పుడు ఇంకో ప్రెస్టీజియస్ ప్రాజెక్టును అతను వదులుకోవాల్సి వచ్చినట్లు తాజా సమాచారం. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ నటిస్తున్న ‘లాల్ సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర చేయడాల్సింది. ఆ పాత్ర పేరు బుప్పా. ఈ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతి బరువు తగ్గి లుక్ మార్చుకోవాల్సి ఉందట. ఈ మేరకు చిత్ర దర్శక నిర్మాతలకు విజయ్ హామీ కూడా ఇచ్చాడట.
ఐతే షూటింగ్ చేయాల్సిన సమయానికి చూస్తే విజయ్ అవతారంలో ఏ మార్పూ రాలేదు. అతను పాత లుక్‌లోనే తమిళంలో సినిమాలు చేస్తూ వచ్చాడు. తన సినిమాల మేకింగ్ విషయంలో అన్నీ తానై వ్యవహరించే ఆమిర్‌కు ఇది నచ్చక విజయ్ సేతుపతి వద్దని చెప్పేశాడట. దీంతో అతడి స్థానంలో వేరే బాలీవుడ్ నటుడినే తీసుకుని షూటింగ్ చేయాలని నిర్ణయించారట. ఇంత పెద్ద ప్రాజెక్టు విషయంలో విజయ్ ఎందుకు కమిట్మెంట్ చూపించలేకపోయాడన్నది ప్రశ్న.
This post was last modified on December 10, 2020 12:35 pm
పుష్ప 2 ది రూల్ ర్యాంపేజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మరో ఆసక్తికరమైన సమరానికి తెరలేస్తోంది. క్రిస్మస్ ని టార్గెట్…
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…