రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది. మూవీ లవర్స్ కనెక్ట్ అయిపోయారు. మేకర్స్ ఏ ఉద్దేశంతో కట్ చేయించారో అది సరిగ్గా నెరవేరింది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 19 లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దురంధర్ 2 అదే రోజు వస్తుందని దాని నిర్మాతలు ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చివర్లో అధికారికంగా చెప్పేశారు. కెజిఎఫ్ తర్వాత యష్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్ కూడా అదే రోజు రానుంది. వాయిదా వార్తలు ఎన్ని వస్తున్నా టీమ్ వాటిని ఖండిస్తూనే వచ్చింది కాబట్టి డేట్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.
వీటితో తలపడటం డెకాయిట్ కు అంత ఈజీగా ఉండదు. ఇమేజ్, బజ్ పరంగా చూసుకుంటే దురంధర్ 2, టాక్సిక్ రెండూ ఒక మెట్టు పైనే ఉంటాయి. కానీ అడివి శేష్ నమ్మకం వేరే ఉంది. గతంలో మేజర్ టైంలో యష్ రాజ్ ఫిలిమ్స్ పృథ్విరాజ్ తో పాటు కమల్ హాసన్ విక్రమ్ వచ్చాయని, అయినా సరే కాంపిటీషన్ తట్టుకుని విజయం సాధించిందని డెకాయిట్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. సరే బాగానే ఉంది కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా దురంధర్ 2 మీద ఉన్న హైప్ చూస్తుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో వేరే సినిమాలకు సరైన థియేటర్లు దొరకడం అనుమానం అనేలా ఉంది.
తమది గోల్డ్ ఫిష్ గా వర్ణించుకుంటున్న అడివి శేష్ ఈసారి పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇప్పటిదాకా ప్రకటించినవి ఏవీ వాయిదా పడకపోతే పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టే. ఎందుకంటే డెకాయిట్ వచ్చిన వారం గ్యాప్ లోనే రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ దిగుతాయి. ఇది చాలా రిస్క్ అవుతుంది. కానీ ఎవరు మాట మీద ఉంటారో, ఎవరు తప్పుతారో చివరి నిమిషం దాకా తేల్చే పరిస్థితి లేకపోవడంతో ఇంకొంత కాలం వేచి చూడాల్సిందే. ఆల్రెడీ డిసెంబర్ 25 వదులుకుని మార్చికి షిఫ్ట్ అయిపోయిన డెకాయిట్ మళ్ళీ ఇంకోసారి డేట్ మార్చే అవకాశం తక్కువే కానీ ఈ పోటీని ఎలా తట్టుకుంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates