‘అల వైకుంఠపురములో’ సక్సెస్ అల్లు అర్జున్‍ని సరాసరి నంబర్‍వన్ స్థానానికి పోటీలో నిలబెట్టింది. ఈ టైమ్‍లో అతను వరుసగా రెండు పెద్ద హిట్లిస్తే ఇక తన పోటీదారులకు తనను అందుకోవడం కష్టమవుతుంది. అల..కి కంటిన్యూషన్‍గా పుష్ప లాంటి ప్రాజెక్ట్ తో పాటు కొరటాల శివ చిత్రాన్ని లైన్లో పెట్టి బన్నీ పకడ్బందీ వ్యూహంతో వెళుతున్నాడు. కాకపోతే కరోనా కారణంగా అల్లు అర్జున్ వేగానికి కళ్లెం పడింది.
మొత్తానికి పుష్ప షూటింగ్ మొదలు పెడితే యూనిట్ సభ్యులు కరోనా బారిన పడడంతో షూటింగ్‍కి బ్రేక్ పడింది. దీంతో షూటింగ్ ఆగకుండా ప్లాన్ చేయమని అల్లు అర్జున్ నిర్మాతలకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చాడట. కరోనా కోసమని బ్రేక్స్ తీసుకోలేమని, ఎవరైనా వైరస్ బారిన పడితే వాళ్లకు బ్రేక్ ఇచ్చి షూటింగ్ కంటిన్యూ చేయాలని, ఇక ఈ చిత్రం షూటింగ్ నిరాటంకంగా జరిగేలా చూడాలని చెప్పాడట.
అయితే అవుట్‍డోర్‍లోనే ఎక్కువ భాగం షూటింగ్ చేయాల్సి వుండడం వల్ల ఈ సినిమా ప్లానింగ్ లైన్ ప్రొడ్యూసర్లకు తలకు మించిన యవ్వారంగా మారిందట. ఈ చిత్రం త్వరగా పూర్తి చేయకపోతే, ఆచార్య ముగించుకుని కొరటాల శివ వేరే సినిమా మొదలు పెడతాడు కనుక అలా జరగకుండా అల్లు అర్జున్ జాగ్రత్త పడుతున్నాడట.
Gulte Telugu Telugu Political and Movie News Updates