బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

యాక్సెసరీస్ విషయంలో అలియా చాలా సింపుల్ గా వెళ్లింది. బ్లాక్ హీల్స్, ఒక స్టేట్ మెంట్ రింగ్, లైట్ గా మెరిసే డైమండ్ చోకర్ మాత్రమే పెట్టుకుంది. హెయిర్ ను లూజ్ బన్ లో కట్టుకొని, కొన్ని స్ట్రాండ్స్ సహజంగా వదిలేసింది. మేకప్ కూడా సాఫ్ట్ గానే ఉంది. డ్యూయీ స్కిన్, పింక్ షేడ్స్ ఐ మేకప్, లైట్ బ్లష్, రోజీ లిప్స్ తో ఫ్రెష్ లుక్ ఇచ్చింది.

వర్క్ ఫ్రంట్ లో చూస్తే అలియా ప్రస్తుతం యష్ రాజ్ ఫిలిమ్స్ ప్రాజెక్ట్ ఆల్ఫా కోసం సిద్ధమవుతోంది. శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శర్వరి, బాబీ డియోల్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా 2026 ఏప్రిల్ 17న విడుదల కానుంది.