బ్లాక్ డ్రెస్ లో మెరిసిన అలియా భట్

అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు, తల్లి పాత్రలో చిన్నారి రాహా సంరక్షణ… అన్నింటినీ చక్కగా చూసుకుంటోంది. ఎక్కడా హడావుడి కనిపించదు. అన్నీ సవ్యంగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. తాజాగా ఫిల్మ్ ఫేర్ ఓటిటి అవార్డ్స్ లో కూడా అలియా అదే కాన్ఫిడెన్స్ తో కనిపించింది.

ఈ ఈవెంట్ లో అలియా బ్లాక్ కలర్ హెర్వే లెగర్ డ్రెస్ లో మెరిసింది. వింటేజ్ టచ్ ఉన్న ఈ డ్రెస్ కు రియా కపూర్ స్టైలింగ్ చేయగా, లుక్ చాలా బాగా కుదిరింది. డీప్ స్వీట్ హార్ట్ నెక్ లైన్, హాల్టర్ స్ట్రాప్స్, బాడీకి ఫిట్ అయ్యే డిజైన్, బ్యాక్ లెస్ కట్, వెనుక భాగంలో చిన్న స్లిట్… మొత్తం లుక్ క్లాస్ గా కనిపించింది.