Movie News

సినిమాల్లేని కాజల్.. తెలుగులో వెబ్ సిరీస్

కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే. సమంత, తమన్నా, అనుష్క.. వీళ్లందరి నుంచి గట్టి పోటీ ఉన్నా సరే వారిని మించి పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని ఒక దశాబ్దం పాటు ఒక వెలుగు వెలిగింది చందమామ. ఐతే హీరోయిన్లకు మరీ సుదీర్ఘ కెరీర్‌ను ఆశిస్తే కష్టమే. 

కాజల్ కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. కొన్నేళ్ల ముందు ఆమెకు అవకాశాలు తగ్గడం మొదలైంది. అదే సమయంలో పెళ్లి చేసుకుంది. దీంతో కెరీర్ ఇంకా స్లో అయిపోయింది. ఆచార్య సినిమాలో నటించినా ఆమె సన్నివేశాలు థియేటర్లలో కనిపించలేదు. ‘భగవంత్ కేసరి’తో హిట్టు కొట్టినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు తెలుగులో దాదాపుగా అవకాాశాలు లేని స్థితికి చేరుకుంది కాజల్.

ఇలాంటి టైంలో కాజల్ ఒక వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమైంది. జియో హాట్ స్టార్ వాళ్లు దాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. హిందీలో విజయవంతం అయిన ‘ఆర్య’కు ఇది రీమేక్ అట. ‘ఆర్య’ కూడా ఒక విదేశీ సిరీస్‌కు రీమేక్. దాన్ని ఇప్పుడు దక్షిణాదిన రీమేక్ చేస్తున్నారు.

కాజల్ తమిళులకు కూడా బాగానే పరిచయం కాబట్టి అక్కడ కూడా దీన్ని రిలీజ్ చేస్తారు. ఐతే ‘ఆర్య’ ప్రస్తుతం ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంది. కాజల్ చేస్తోంది అంటే.. హిందీకి పరిమితం చేసి మిగతా భాషల్లో ఆడియో తీసేస్తారన్నమాట. 

హిందీ వెర్షన్లో సుస్మితా సేన్ లీడ్ రోల్ చేసింది. ఆమెది నడి వయస్కురాలి పాత్ర. వయసుకు ఎదిగిన పిల్లలూ ఉంటారు. గ్లామర్ క్వీన్‌గా పేరున్న కాజల్.. అలాంటి పాత్రకు ఒప్పుకోవడం సాహసమే. ఇంతకుముందు కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే హార్రర్ వెబ్ సిరీస్‌లో నటించింది. కానీ అది ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ వెబ్ సిరీస్ చేయనుంది. దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.

This post was last modified on December 11, 2025 10:48 pm

Share

Recent Posts

చిరు ఓదెల… వాయిదా పడిన అభిమానుల కల

ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…

22 minutes ago

చంద్రబాబు, పవన్ భేటీలో సీట్లు ఖరారయ్యాయా…?

మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…

43 minutes ago

పోలీస్ కమిషనరేట్ గా రాజమండ్రి!

రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…

49 minutes ago

రక్తపాతానికి దూరంగా నాని ప్రయాణం

హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…

52 minutes ago

హనుమాన్ ఆశీర్వాదం భారీగా దక్కాలి

బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…

3 hours ago

విశ్వంభర తలుపులు తెరుచుకుంటున్నాయా

2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…

4 hours ago