రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా మారిన అఖండ 2 వాయిదా కథ క్లైమాక్స్ కు చేరుకుంది. అభిమానుల ఒత్తిడో లేక ఇంకేదైనా కారణమో తర్వాత చూసుకోవచ్చు కానీ ముందైతే విడుదల తేదీని డిసెంబర్ 12 లాక్ చేస్తూ నిర్మాతలు అధికారిక ప్రకటన ఇచ్చారు. జరిగిన పరిణామాలకు సారీ చెప్పి డబుల్ బ్లాక్ బస్టర్ ఖాయమనే హామీ ఇచ్చేశారు. డిసెంబర్ 11 రాత్రి స్పెషల్ ప్రీమియర్లు వేయబోతున్నారు. ఇక ఇప్పుడు ఎలాంటి మార్పు ఉండబోవడం లేదు. ఖచ్చితంగా చెప్పిన టైంకే షోలు మొదలైపోతాయి.
ఇప్పుడు అందరి చూపు పదకొండు అర్ధరాత్రి వచ్చే టాక్ మీద ఉంది. ప్రత్యేకంగా రిలీజ్ ట్రైలర్ కూడా సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రమోషన్ల పరంగా బాలకృష్ణ. బోయపాటి శీను, సంయుక్త మీనన్, ఇతర నటీనటులు చేయాల్సిందంతా చేశారు కాబట్టి ఈ రెండు రోజుల్లో ఎలాంటి పబ్లిసిటీ ఉండకపోవచ్చు. వాయిదా మొదట కొంచెం నెగటివ్ గా అనిపించినా క్రమంగా ఇదే సానుకూలాంశంగా మారిందని భావించిన ఫ్యాన్స్ లేకపోలేదు. డిసెంబర్ 25కి వెళ్తే ఆలస్యమవుతుందని టెన్షన్ పడిన వాళ్ళు ఉన్నారు. కానీ అలాంటిదేమి లేకుండా ఫ్యాన్స్ కోరుకున్న ప్రకారమే ప్రొడ్యూసర్లు నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం.
ఎలాగూ ఇది జరుగుతుందని ముందే తెలిసిన ఇతర సినిమాలు ప్రమోషన్లను ఆపేశాయి. మోగ్లీ నుంచి ఇంకా ఎలాంటి నోట్ రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ వైపు నుంచి బుకింగ్స్ మొదలైనట్టుగా ట్వీట్లు పెట్టారు కానీ దర్శకుడు సందీప్ రాజ్ నిరాశని వ్యక్తం చేస్తూ మెసేజ్ పెట్టడం టాక్ అయ్యింది. ఈషా మరో వారం ఆలస్యం కావొచ్చు. సైక్ సిద్దార్థ్ మాత్రం రిలీజ్ లో ఎలాంటి లేదు అంటున్నాడు. కార్తీ అన్నగారు వస్తారులో సైతం ఎలాంటి మార్పు లేదు. ఇదంతా అలా ఉంచితే గత పది రోజులుగా డల్లుగా ఉన్న థియేటర్లను హౌస్ ఫుల్స్ తో కళకళలాడించేలా చేయడం బాలయ్య భుజాల మీద ఉంది. చూడాలి ఏం చేస్తారో.
Gulte Telugu Telugu Political and Movie News Updates