ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో ‘బిగ్ బాస్’ గురించి ఎక్కువ చర్చా జరగట్లేదు. కానీ దానికంటూ ఒక వర్గం ప్రేక్షకులున్నారు. షో రూల్స్ మారినా.. పార్టిసిపెంట్లు మారినా.. ఏం జరిగినా.. దాన్ని వాళ్లు ఫాలో అవుతూనే ఉంటారు.
ప్రస్తుత 9వ సీజన్ విషయానికి వస్తే.. ఒకప్పటితో పోలిస్తే పార్టిసిపెంట్లు ఆకర్షణీయంగా లేరనే చర్చ జరిగింది. అయినా సరే ఉన్న వాళ్లలో కొందరు షోను ఎగ్జైటింగ్‌గా మార్చారు. ఈ మధ్య కొన్ని వివాదాలు షోకు హైప్ తీసుకొచ్చాయి. మొత్తానికి షో చివరి దశకు వచ్చేసింది. ఇంకో రెండు వారాలే మిగిలున్నాయి ‘బిగ్ బాస్’ తొమ్మిదో సీజన్లో.
ఈ సీజన్లో పెద్ద సర్ప్రైజ్ అంటే.. కళ్యాణ్ పడాల అనే చెప్పాలి. అతను ఒక కామనర్. మొదట్లో అతనేం అంత ప్రత్యేకంగా అనిపించలేదు. కానీ సీజన్ ద్వితీయార్ధంలో అతను భలేగా పుంజుకున్నాడు. గత కొన్ని వారాల్లో అతడి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. గేమ్ భలేగా ఆడుతున్నాడని.. జెన్యూన్‌గా ఉంటున్నాడని.. మెచ్యూర్డ్‌గా, పుల్ క్లారిటీతో మాట్లాడతాడని అతడికి పేరొచ్చింది. ప్రేక్షకులతో ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిన అతను ఓటింగ్‌లో అనూహ్యంగా రైజ్ అయ్యాడు.
కొన్ని వారాల ముందు వరకు ఇమ్మాన్యుయెల్, తనూజ టైటిల్ ఫేవరెట్ల రేసులో ముందున్నారు. కళ్యాణ్ అప్పుడు పోటీలోనే లేడు. కానీ ఇప్పుడు అతణ్ని ఫేవరెట్లలో ఒకటిగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం అతను షోలో ఓటింగ్ పరంగా టాప్-3లో చోటు సంపాదించడం విశేషం. అంతే కాదు.. ఫైనల్ చేరిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదే ఊపును తర్వాతి రెండు వారాల్లోనూ కొనసాగిస్తే కళ్యాణ్ పడాల టైటిల్ సాధించినా ఆశ్చర్యం లేదు. కానీ తనూజ, ఇమ్మాన్యుయెల్ నుంచి అతడికి గట్టి పోటీ ఉంటుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates