ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు, దాని అమలు చేసే కసరత్తులో లేటయ్యిందని సమాచారం. ఇక హైక్ విషయానికి వస్తే రాత్రి ఎనిమిది గంటలకు వేసుకునే ప్రీమియర్ షోలకు ఏపీలాగే ఫ్లాట్ 600 రూపాయలు టికెట్ ధర నిర్ణయించారు. ఆపై మూడు రోజుల పాటు సింగల్ 75, మల్టీప్లెక్స్ 100 రూపాయలు ప్రతి టికెట్ మీద రేట్లు పెంచుకోవచ్చు. ఆపై అంటే డిసెంబర్ 8 నుంచి గరిష్టంగా అనుమతించిన రేట్లు ఉంటాయి. పది రోజుల పాటు ఇవ్వకపోవడం ప్రేక్షకుల కోణంలో సానుకూల విషయమే.
ఇక పెంపు ఇచ్చిన మేర అఖండ 2 ఏదైతే రెవిన్యూ అందుకుంటుందో అందులో 20 శాతం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, లేబర్ కమీషనర్ సంప్రదింపులతో విడిగా ఒక అకౌంట్ మైంటైన్ చేయబడుతుంది. సినీ కార్మికుల సంక్షేమం కోసం దీన్ని వినియోగిస్తారు. ఇది ఉభయకుశలోపరి అని చెప్పేందుకు కారణముంది. ఆడియన్స్ వైపు చూసుకుంటే పెంపు మూడు రోజులే ఉంది కాబట్టి ఆదివారం నుంచే రెగ్యులర్ రేట్లకు అఖండ 2ని ఎంజాయ్ చేయొచ్చు. ఇది ప్రొడ్యూసర్ కు ఇంకో యాంగిల్ లో మేలు చేసేదే.
వీక్ డేస్ డ్రాప్ ఎక్కువగా ఉండకుండా ఇది దోహదపడుతుంది. అఖండ 2 బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఎలాగూ పోటీ లేదు కాబట్టి కావాల్సినన్ని అదనపు స్క్రీన్లు, షోలు జోడించుకోవచ్చు. ఇది డిస్ట్రిబ్యూటర్లకు హెల్ప్ అవుతుంది. కాకపోతే ఈ వెసులుబాటు ఏదో కనీసం ఒక్క రోజు ముందే ఇచ్చి ఉంటే బుకింగ్స్ ఊపు మీద ఉండేవి. ముఖ్యంగా స్పెషల్ షోలకు డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఫ్యాన్స్ త్వరగా సోల్డ్ అవుట్స్ చేసేవాళ్ళు. ఇప్పటికైనా మించిపోలేదు కానీ భవిష్యత్తులో రాబోయే పెద్ద సినిమాలకు ఇప్పుడీ అఖండ 2 వల్ల ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ తెలంగాణలో మొదలైపోయింది. దీన్ని ఫాలో కావడమే బాకీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates