సింగర్ సునీత గురించి తెలుగు వారికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీనేజీలోనే దూరదర్శన్‌లో గాయనిగా తన ప్రతిభను చాటుకుని.. ఆ తర్వాత సినీ రంగంలో అవకాశాలు సంపాదించి గొప్ప పేరు సంపాదించింది. గాయనిగానే కాక డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ సునీత ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
19 ఏళ్ల వయసులోనే టీవీ టెక్నీషియన్ అయిన కిరణ్ కుమార్ గోపరాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది సునీత. ఐతే కొన్నేళ్ల తర్వాత కిరణ్ నుంచి సునీత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక అప్పట్నుంచి ఆమె రెండో పెళ్లి గురించి తరచుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని ఆమె ఖండిస్తూనే వస్తోంది. ఐతే ఇప్పుడు సునీత 42 ఏళ్ల వయసులో నిజంగానే రెండో పెళ్లికి సిద్ధమైంది. ఆమెకు నిశ్చితార్థం కూడా పూర్తయింది.
ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానెల్ అధినేత అయిన మీడియా వ్యక్తిని సునీత పెళ్లాడనుంది. ఇరు కుటుంబాల అంగీకారంతో, వారి సమక్షంలో ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. సునీతను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు రామ్ అట. ఆయన కూడా మధ్య వయస్కుడే. బహుశా ఆయనకూ ఇది రెండో పెళ్లి అయి ఉండొచ్చనిపిస్తోంది. త్వరలోనే వీరి వివాహం జరగబోతోంది.
సునీతకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. వాళ్లు యుక్త వయసులో ఉన్నారు. జీవితంలో ఏ దశలో అయినా తోడు అనేది చాలా అవసరం. కాబట్టి తొలి వివాహం విఫలమయ్యాక ఏ వయసులో అయినా సరే.. ఇంకో పెళ్లి చేసుకోవడం అవసరమే. మరి ఈ పెళ్లి గురించి సునీత అధికారికంగా ప్రకటన చేస్తుందో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates