టాలీవుడ్ నిర్మాతల్లో సూర్యదేవర నాగవంశీని ఫైర్ బ్రాండ్‌గా చెప్పొచ్చు. సినిమా వేడుకలైనా, ఇంటర్వ్యూల్లో అయినా ఆయన చాలా అగ్రెసివ్‌గా, స్ట్రెయిట్‌గా మాట్లాడుతుంటారు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో నాగవంశీ ఇబ్బంది పడ్డాడు కూడా. అయినా తన శైలేమీ మారదు. తన బేనర్ నుంచి రాబోతున్న కొత్త సినిమా ఎపిక్ టైటిల్ టీజర్ లాంచ్ సందర్భంగా నాగవంశీ తనదైన శైలిలో పంచ్‌లు విసిరాడు.
ఇటీవలే అరెస్ట్ అయిన పైరసీ సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు రవి గురించి సోషల్ మీడియా జనాలు స్పందించిన తీరుపై నాగవంశీ గట్టి కౌంటరే వేశాడు. 90వ దశకం కథతో ఎపిక్ మూవీ తెరకెక్కిన నేపథ్యంలో అప్పటి రోజులకు, ఇప్పటికి ఏం మారింది.. ఏం మిస్ అయింది అని ఒక ప్రశ్న ఎదురైంది నాగవంశీకి. దానికి ఆయన బదులిస్తూ.. మార్పు అంతా సోషల్ మీడియానే అని కామెంట్ చేశాడు. ఐబొమ్మ రవిని జనం రాబిన్ హుడ్ అని కీర్తిస్తున్నారని.. ఇంతకంటే అన్యాయం ఉందా అని ఆయన ప్రశ్నించాడు.
రవిని రాబిన్ హుడ్‌గా కొనియాడుతూ.. డబ్బులు పెట్టి, కష్టపడి సినిమాలు తీసే తమను దొంగల్లాగా చూస్తున్నారని.. 50 రూపాయలు టికెట్ రేటు పెంచితే దాన్ని తప్పుబడుతున్నారని.. ఇదే సోషల్ మీడియా వల్ల ఇప్పుడొచ్చిన మార్పు అని నాగవంశీ అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు విజయ్ దేవరకొండతో కింగ్డమ్ తీసిన మీరు, ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో ఎపిక్ మూవీ తీశారు కదా.. ఈ అనుభవం గురించి ఏం చెబుతారని నాగవంశీని అడిగితే.. ఈ రెండు చిత్రాలకు పోలిక పెట్టొద్దని.. దానికి దీనికి ఏమాత్రం సంబంధం లేదని తేల్చేశాడు నాగవంశీ.
కింగ్డమ్ పెద్ద హిట్ అయి ఉంటే ఇలా పోల్చి మాట్లాడితే బాగుంటుందని.. కోరుకున్న ఫలితం రానపుడు దాని ప్రస్తావన ఎందుకని ఆయన ప్రశ్నించాడు. సంక్రాంతికి రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ లాంటి పెద్ద సినిమాలతో మీ సినిమా అనగనగా ఒక రాజు పోటీ గురించి అడిగితే.. అన్నింట్లోకి చిన్న సినిమా తమదే కాబట్టి జనాలు సింపతీతో తమ సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నట్లు నాగవంశీ సెటైరిగ్గా మాట్లాడాడు.
This post was last modified on December 1, 2025 11:19 pm
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి మహానగరంగా నిర్మించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. ఆదిశగా వడి వడిగా అడుగులు వేస్తున్నారు.…
అనుకున్నట్టే అఖండ 2 తాండవం టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ముందు రోజు…
పాకిస్థాన్ మాజీ ప్రధాని, ప్రముఖ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు గట్టి నమ్మకం ఏర్పడుతోందని ఆయన కుమారులు సులేమాన్,…
కోనసీమ కొబ్బరి తోటలు ఎండిపోవడానికి దిష్టి తగలడం, తెలంగాణ నాయకుల పదే పదే ఇక్కడి పచ్చదనం గురించి మాట్లాడడమే కారణమని,…
మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత విడదల రజిని పార్టీని వీడిపోతారంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు…
తమ డాలర్ డ్రీమ్స్ నెరవేర్చుకునేందుకు ప్రతి ఏటా వేలాదిమంది అమెరికాకు వెళ్తుంటారు. ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు, జీవన ప్రమాణాలు ఉండడంతో…