Movie News

ఉస్తాద్ మీద ఇంత పెద్ద స్టేట్ మెంటా

ఏపీలో కూటమి పాలన వచ్చాక పవన్ కళ్యాణ్ పెండింగ్ పడిపోయి అభిమానులకు తక్కువ నమ్మకం ఉన్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఉంది. తేరికి రీమేక్ అనే ప్రచారం కాస్త నెగటివ్ బజ్ తీసుకొచ్చిన మాట వాస్తవం. పైగా దర్శకుడు హరీష్ శంకర్ ముందు రాసుకున్న భవదీయుడు భగత్ సింగ్ ని పక్కనపెట్టి దాని స్థానంలో ఉస్తాద్ ని తేవడం అభిమానుల్లో అనుమానాలు పెంచింది. అయితే ఒకటి రెండు పోలికలు అనిపించినప్పటికీ ఇది పూర్తిగా కొత్త స్టోరీ అని, కంపారిజన్ చేయడానికి ఛాన్స్ లేనట్టుగా డైరెక్టర్ తో పాటు ఆ టీమ్ లో ఉన్న దశరథ్ లాంటి సీనియర్లు చెప్పారు. ఇదంతా బాగానే ఉంది కానీ అసలు విషయానికి వద్దాం.

నిన్న జరిగిన ఆంధ్రకింగ్ తాలూకా ఈవెంట్ లో నిర్మాత మైత్రి రవిశంకర్ మాట్లాడుతూ ఓజిని మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఉంటుందని చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తంలో అనౌన్స్ మెంట్ స్టేజి నుంచి ప్రీమియర్ షో దాకా భారీ క్రేజ్ మోసిన మూవీ ఓజినే. దీనికి సంబంధించిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ బులెట్ లాగా దూసుకుపోయింది. అంచనాలకు తగ్గట్టే బ్లాక్ బస్టర్ అయ్యింది. కానీ ఉస్తాద్ దానికి మించి అని చెప్పడం చాలా పెద్ద స్టేట్ మెంట్. ఎందుకంటే దీన్ని ఆధారంగా చేసుకుని ఫ్యాన్స్ ఎక్కడలేని అంచనాలు పెంచేసుకుంటారు. ఇదే అసలు రిస్క్.

మరి అంతగా హరీష్ శంకర్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాడనేది వేచి చూడాలి. వచ్చే నెల మొదటి ఆడియో సింగల్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందని రవిశంకర్ చెప్పారు. అయితే మైత్రినే నిర్మాణ భాగస్వామిగా ఉన్న పెద్ది మార్చి 27 రానుంది. అబ్బాయికి బాబాయికి కేవలం వారం గ్యాప్ మాత్రమే ఉంటుందా అనేది అసలు ప్రశ్న. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఏదీ మాట మీద ఉండే పరిస్థితి లేదు కాబట్టి ఆలోగా ఏమేం మార్పులు, షాకులు జరుగుతాయో వేచి చూడాలి. ప్రస్తుతం ఉస్తాద్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

This post was last modified on November 23, 2025 2:17 pm

Share

Recent Posts

వంద కోట్ల బోణీ సులభంగా కనపడుతోంది

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ అడ్వాన్స్ బుకింగ్ వావ్ అనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా ఓపెన్ చేసినప్పటికీ టికెట్లు…

5 minutes ago

పాలు అమ్మాను… అనే పెద్దాయన చిన్న సినిమాకు పర్మిషన్ ఇవ్వలేదు

ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు ఎదురయ్యే చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇక మేకర్స్ అప్పుడప్పుడు ఓపెన్ గా మాట్లాడే…

51 minutes ago

3,400 లిప్‌స్టిక్‌ ముద్దులు… చివరికి రూ.5,500 జరిమానా!

ముద్దుల గుర్తులతో మెరిసిపోయిన ఓ కారు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వీధుల్లో అందరి దృష్టినీ ఆకర్షించింది. కారు మొత్తం దాదాపు 3,400…

1 hour ago

నాకు యాక్టింగ్ నేర్పిస్తావా… ఇరుముడి పాపతో ధనుష్

రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన ఇరుముడి బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అందుకుంటోంది. ఈ సినిమాలో హీరో…

2 hours ago

ఏకగ్రీవాలు జరిగితే MLA టికెట్ ఇవ్వను: జగన్!

స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఆ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో…

2 hours ago

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

5 hours ago