కేవలం రెండు సినిమాల అనుభవంతో ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ఒకడైపోయాడు ప్రశాంత్ నీల్. ఇదంతా ‘కేజీఎఫ్’ మహిమ. ఆ సినిమా సంచలన విజయం సాధించి వివిధ భాషల స్టార్లు ప్రశాంత్ వైపు చూసేలా చేసింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్లు అతడితో సినిమా చేయడానికి అమితాసక్తి చూపించారు. ప్రశాంత్ కూడా టాలీవుడ్‌ను నిరాశపరచకుండా ప్రభాస్, ఎన్టీఆర్‌లతో సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. ముందుగా ప్రభాస్‌తో ‘సలార్’ సినిమాను అతను మొదలుపెట్టబోతున్నాడు.
ఐతే తనకు లైఫ్ ఇచ్చిన శాండిల్‌వుడ్‌ను నిర్లక్ష్యం చేసి టాలీవుడ్ స్టార్ల కోసం పరుగులు పెడుతున్నాడంటూ ప్రశాంత్ మీద కన్నడిగులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో అతణ్ని ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇంతకుముందు ఎన్టీఆర్ సినిమాను కన్ఫమ్ చేసినపుడు, ఇప్పుడు ప్రభాస్ సినిమాను ప్రకటించినపుడు ఇది స్పష్టంగా కనిపించింది.
ఐతే సొంతగడ్డ నుంచి ఈ వ్యతిరేకత చూశాక ప్రశాంత్ అప్రమత్తం అయ్యాడు. తాను ప్రభాస్‌తోనే ఎందుకు సినిమా చేస్తున్నానో అతను వివరణ ఇచ్చుకున్నాడు. ‘‘నేను దర్శకుడిగా పేరు తెచ్చుకున్నది కన్నడ సినిమాలతోనే. ఉగ్రం, కేజీఎఫ్ సినిమాలతో నాకు పేరొచ్చింది. ఐతే ఇప్పుడు ఇక్కడున్న హీరోలను కాకుండా తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రభాస్‌ను నా తర్వాతి సినిమాకు హీరోగా ఎంచుకోవడం గురించి చాలామంది అడుగుతున్నారు. ఐతే నేను రాసుకున్న ‘సలార్’ కథకు ప్రభాస్ అయితేనే సరిపోతాడని అనిపించే అతడితో చేస్తున్నా. మిగతా విషయాలు సినిమా విడుదలయ్యాక మాట్లాడుకుందాం’’ అని ప్రశాంత్ అన్నాడు.
ఇక ‘సలార్’ టైటిల్‌కు అర్థం వివరిస్తూ.. ‘‘ఈ టైటిల్ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అది ఒక సామాన్యమైన పదం. ఉర్దూలో సమర్థమంతమైన నాయకుడు అని దానికర్థం. రాజుకు కుడి భుజంగా ఉంటూ ప్రజల సంరక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని కూడా అనొచ్చు. కథకు అద్దం పట్టేలా ఫస్ట్ లుక్ తీర్చిదిద్దాం. అది చూసి ప్రభాస్ ఆర్మీ మ్యాన్ అనుకుంటారనే ‘సలార్’ అనే టైటిల్ కూడా ప్రకటించాం’’ అని ప్రశాంత్ అన్నాడు.
This post was last modified on December 4, 2020 4:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…