ఫోటోస్ – కొత్త మిస్ వరల్డ్ తనే

ఈ ఏడాది విశ్వసుందరి కిరీటం మెక్సికో భామను వరించింది. థాయ్‌లాండ్‌ వేదికగా జరిగిన మిస్‌ యూనివర్స్‌ 2025 పోటీల్లో మిస్‌ మెక్సికో ఫాతిమా బాష్‌ కిరీటం దక్కించుకుంది. ఈ పోటీల్లో అద్భుతంగా రాణించిన ఆమె, గట్టి పోటీని అధిగమించి టైటిల్‌ను కైవసం చేసుకుంది.

ప్రపంచ అందాల వేదికపై మెక్సికోకు మరోసారి గౌరవం తీసుకొచ్చిన ఫాతిమా బాష్, తన స్టేజ్ ప్రెజెన్స్‌, ప్రతిభ, ఆత్మవిశ్వాసంతో జడ్జిలను ఆకట్టుకున్నారు. ఫాతిమా మెక్సికోలోని టబాస్కో రాష్ట్రం టియాపాలో 19 మే 2000లో జన్మించారు. ఫ్యాషన్ డిజైన్లో చదువు పూర్తి చేశారు. ఎత్తు 5.5 అడుగులు. పెయింటింగ్, టెన్నిస్ ఆడటం, గుర్రపు స్వారీ ఆమె హాబీలు. 

థాయ్లాండ్లోని నోంతబురి నగరంలో అంగరంగవైభవంగా ఈ గ్రాండ్ ఫినాలే జరిగింది. స్టీవ్ బైర్న్ హోస్ట్గా వ్యవహరించగా.. థాయ్ గాయకుడు జెఫ్ సాచుర్ ప్రదర్శన హైలైట్గా నిలిచింది. వందకి పైగా దేశాల పోటీదారుల్ని ఓడించి.. 74వ విశ్వ సుందరి సుందరి టైటిల్ను ఫాతిమా గెలుచుకున్నారు. న్యాయ నిర్ణేతలు అందిన ప్రశ్నకు.. “మహిళలు ప్రపంచవ్యాప్తంగా తమ గొంతు వినిపించి.. మార్పు తీసుకురావాలి”అని ఆమె బదులిచ్చారు. భారత తరఫున ప్రాతినిధ్యం వహించిన మణికకు నిరాశ ఎదురయింది. టాప్ 12 లో ఆమె వెనుదిగింది.