రామ్ గోపాల్ వర్మ అంటే.. తెలుగు సినిమా రూపు రేఖలనే మార్చిన దర్శకుడు. తన తొలి చిత్రం ‘శివ’తో ఆయన రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లి రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్ లాంటి చిత్రాలతో అక్కడా సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ తర్వాతి కాలంలో దర్శకుడిగా ఆయన ఎంత పతనం అయిపోయాడో తెలిసిందే. ఐతే ఒక దశ దాటాక ఎలాంటి దర్శకుడైనా ఔట్ డేట్ అయిపోవడం, ఫెయిల్యూర్లు ఇవ్వడం కామనే. కానీ వర్మ అంతటితో ఆగిపోకుండా వ్యక్తిగా కూడా పతనం అయ్యాడు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మౌత్ పీస్‌గా మారి.. ఆ పార్టీ కోసమని టీడీపీ, జనసేన ముఖ్య నేతలను టార్గెట్ చేస్తూ సినిమాలు తీయడం.. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌ల మీద వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించడం వర్మ మీద తీవ్ర వ్యతిరేకతను పెంచింది. ఈ క్రమంలో పవన్ అన్నయ్య అయిన మెగాస్టార్ చిరంజీవిని కూడా విడిచిపెట్టలేదు వర్మ. ఐతే 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చవిచూడడంతో వర్మలో మార్పు వచ్చింది. ఇక రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుని సినిమాల మీద ఫోకస్ పెడుతున్నాడు.
ఈ క్రమంలో తాను ఇంతకుముందు చేసింది తప్పని అర్థం చేసుకుని పశ్చాత్తాపం కూడా చెందుతున్నాడు. తాజాగా వర్మ చిరును క్షమాపణ కోరడం గమనార్హం. వర్మ డెబ్యూ మూవీ శివ రీ రిలీజ్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఒక వీడియో బైట్ ద్వారా టీంకు శుభాకాంక్షలు చెప్పారు. శివ అప్పట్లో ఎలా ట్రెండ్ సెట్ చేసిందో చెబుతూ ఆ సినిమాపై ప్రశంసలు కురిపించారు చిరు. ఇందులో రామ్ గోపాల్ వర్మను కూడా ఆకాశానికెత్తేశాడు చిరు. వర్మ విజన్ అద్భుతమని.. శివ సినిమాతో తెలుగు సినిమా భవిష్యత్తుగా మారాడని చిరు కొనియాడారు.
ఈ వీడియోను వర్మ షేర్ చేస్తూ చిరుకు వర్మ ధన్యవాదాలు చెప్పాడు. అంతే కాక తాను ఎప్పుడైనా ఆయన్ని నొప్పించి ఉంటే క్షమించాలని కోరాడు. వివరంగా చెప్పకపోయినా.. గతంలో వైసీపీతో అంటకాగుతూ చిరును టార్గెట్ చేయడంపై వర్మ ఇప్పుడు పశ్చాత్తాపం చెందుతున్నాడన్నది వాస్తవం. ఇప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం కావడం మంచిదే అని.. వర్మ తనను, పవన్‌ను ఎంతగా టార్గెట్ చేసినా అదేమీ పట్టించుకోకుండా ‘శివ’ రీ రిలీజ్ నేపథ్యంలో ఆ దర్శకుడిని కొనియాడడం చిరు గొప్పదనానికి నిదర్శనమని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on November 9, 2025 9:54 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…