‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని త్వరగా పూర్తి చేయాలనే ఒత్తిడి రాజమౌళిపై అధికంగా వున్నా కానీ అతను మాత్రం రాజీ పడడం లేదు. క్వాలిటీ పరంగా ఈ చిత్రాన్ని బాహుబలికి సాటిగా నిలబెట్టడానికి రాజమౌళి అహర్నిశలు కృషి చేస్తున్నాడు. లేట్ అవుతోందనే కంప్లయింట్ వున్నా కానీ రాజమౌళి మాత్రం తన ఆలోచనలు తెరపై కనిపించే వరకు వెనుకాడడం లేదు.
ఈ చిత్రం కోసం ఒక భారీ యాక్షన్ సీన్‍ని రాజమౌళి పూర్తి చేసాడు. ఈ ఫైట్ సీన్ కోసం యాభై రోజుల పాటు శ్రమించారు. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంత ఖర్చుతో, అంతే సమయంలో ఒక మిడిల్ రేంజ్ సినిమా తీసేసుకోవచ్చట. అంటే సినిమాలో అయిదారు నిమిషాల సన్నివేశం బదులుగా రెండున్నర గంటల సినిమా తీయవచ్చునన్న మాట. దీనిని బట్టి ఈ చిత్రానికి అవుతోన్న ఖర్చెంత, ఒక్కో సీన్‍కీ పడుతోన్న సమయమెంత అనేది అర్థం చేసుకోవచ్చు.
జులై నెలాఖరుకి విడుదల చేయగలననే ధీమా రాజమౌళి చూపిస్తున్నా కానీ అది జరగదని, 2022 సంక్రాంతికి గానీ ఈ చిత్రం విడుదల కాదని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అందుకు తగ్గట్టే ఇతర సినిమాల రిలీజ్ ప్లాన్స్ కూడా జరుగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates