ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా ‘దొరసాని’ ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అయినా నిరాశ పడకుండా రెండవ సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ గప్‍చుప్‍గా చేసేసాడు. లాక్‍డౌన్ ముందే రిలీజ్‍కి రెడీ అయిన ఆ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని చూసారు. కానీ పరిస్థితులు మెరుగవ్వకపోవడంతో అమెజాన్‍లో విడుదల చేసారు.
ఆనంద్‍కి ఈ సినిమాతో పేరు వచ్చి హీరోగా బిజీ అవుతాడని దేవరకొండ ఫ్యామిలీ ఆశించింది. అయితే ఆ సినిమాలో హీరో కంటే హీరో తండ్రిగా నటించిన గోపరాజు రమణ గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. సినిమాకి అతని పాత్రే హైలైట్ అని, అతడు లేకపోతే సినిమానే లేదని కూడా చాలా మంది అంగీకరిస్తున్నారు. అలా హీరోకి ప్లస్ అవుతుందని భావించిన సినిమా కాస్తా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి బ్రేక్ ఇచ్చింది.
ఇప్పుడు గోపరాజు రమణ కోసం ఎంక్వయిరీ చేసేవాళ్లు ఎక్కువయ్యారు. మిడిల్ క్లాస్ తరహా తండ్రి క్యారెక్టర్లుంటే అతడినే కాంటాక్ట్ చేస్తున్నారు. దీంతో ఆ తరహా పాత్రలు చేసే నటుల అవకాశాలు రమణ వశమవుతున్నాయి. డెయిలీ పే కూడా తక్కువే కావడం వల్ల రమణ డైరీ చాలా బిజీ అయిపోయిందట. వచ్చే ఏడాదిలో అతను ఒక డజను సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యం లేదనేది టాలీవుడ్ మాట.