పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రం ఓజీ అంటే అతిశయోక్తి కాదు. ఆ హైప్‌కు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించిందా చిత్రం. పవన్ కెరీర్లో 200 కోట్ల గ్రాస్, 100 కోట్ల షేర్ లేని లోటును ఈ సినిమా భర్తీ చేసింది. ఏకంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్.. రూ.180 కోట్లకు పైగా షేర్ రాబట్టి పవన్ కెరీర్లో ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ఈ ఏడాదికి తెలుగులో ఇదే హైయెస్ట్ గ్రాసర్ కావడం విశేషం. ఇలా పవన్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిన ఓజీ.. ఇప్పుడు ఓటీటీలో కూడా అదరగొడుతోంది.
ఈ నెల 23న స్ట్రీమింగ్ జెయింట్ నెట్ ఫ్లిక్స్ ఓజీని రిలీజ్ చేసింది. అప్పట్నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోంది. తెలుగు అనే కాక వివిధ భాషల్లో ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. రిలీజ్ దగ్గర్నుంచి ఇండియాలో నెట్ ఫ్లిక్స్ వ్యూయర్‌షిప్ ఛార్ట్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతోంది ఓజీ. అంతే కాక 10 దేశాల్లో నెట్ ఫ్లిక్స్ చార్ట్స్‌లో టాప్-10లో కొనసాగుతోంది ఓజీ. గ్లోబల్‌గా ఈ సినిమా బాగా ట్రెండ్ అవుతోంది. ఒక రీజనల్ మూవీకి ఇలాంటి రెస్పాన్స్ అరుదే. ఇప్పటిదాకా ఓజీకి నెట్‌ఫ్లిక్స్‌లో 3.5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయట. ఓజీ వల్ల నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త సబ్‌స్క్రిప్షన్లు కూడా భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది.
థియేటర్లలో విడుదలైనపుడు ఓజీకి కొంత మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ ఓటీటీలో అంతకంటే పాజిటివ్ స్పందనే కనిపిస్తోంది. తమిళ ఆడియన్స్ గుడ్ బ్యాడ్ అగ్లీతో పోల్చి ఈ సినిమాను కొంత డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నించారు కానీ.. ఓవరాల్‌గా మాత్రం అందరూ పాజిటివ్‌గానే స్పందిస్తున్నారు. హిందీ ఆడియన్స్‌కు ఈ సినిమా బాగానే నచ్చుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమా అంతా ఫ్యాన్ మూమెంట్స్, ఎలివేషన్లే కావడంతో పవర్ స్టార్ అభిమానులు ఈ సినిమాను రిపీట్స్‌లో చూస్తున్నారు. దర్శకుడు సుజీత్, సంగీత దర్శకుడు తమన్ మీద మరోసారి ప్రశంసలు కురుస్తున్నాయి.
This post was last modified on October 29, 2025 10:06 pm
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…