గత మూడేళ్ళలో చిరంజీవి గొప్పగా చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్ వాల్తేర్ వీరయ్య ఒక్కటే. అందుకే ఆ కాంబినేషన్ రిపీట్ కావాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే వచ్చారు. వాళ్ళ నిరీక్షణ ఫలించి ఇటీవలే కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ దర్శకుడు బాబీతో మెగా మూవీని ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేలా ప్లానింగ్ జరుగుతోంది. ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారులో బిజీగా ఉన్న మెగాస్టార్ నవంబర్ మూడో వారంకల్లా ఫ్రీ అవ్వొచ్చు. ఆపై మేకోవర్ కు కొంత సమయం తీసుకుని ఎక్కువ గ్యాప్ లేకుండా స్టార్ట్ చేయమని బాబీకి సూచనలు ఇచ్చారట. ఇప్పుడు హీరోయిన్ల వంతు వచ్చింది.
వయొలెంట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఈ మూవీకి ఇద్దరు హీరోయిన్లు అవసరమట. రాశి ఖన్నాని సంప్రదించారని ఇన్ సైడ్ టాక్. పవన్ కళ్యాణ్ తో ఆల్రెడీ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటించేసింది కాబట్టి ఇప్పుడు అన్నయ్యతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంటే ఒక మెగా మెమరీ అలా భద్రపరుచుకోవచ్చు. ఇలా ఇద్దరితోనూ యాక్ట్ చేసిన శృతి హాసన్, కాజల్ అగర్వాల్ సరసన రాశి ఖన్నా కూడా చేరొచ్చు. రెండో పేరుగా మాళవిక మోహనన్ గురించి చెబుతున్నారు. రాజా సాబ్ ఫలితం కోసం ఎదురు చూస్తున్న ఈ మాస్టర్ బ్యూటీ ఇంత సీనియర్ సరసన నటించాలా వద్దానే మీమాంసలో ఉన్నట్టు అంతర్గత వర్గాల మాట.
సానుకూలంగా స్పందిస్తే మాత్రం వీళ్ళలో ఒకరో ఇద్దరో లాక్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. తమన్ సంగీతం సమకూర్చబోయే ఈ మూవీలో బాబీ చాలా పవర్ ఫుల్ క్యారెక్టర్ ని చిరంజీవి కోసం డిజైన్ చేశాడట. డాకు మహారాజ్ విషయంలో ఫ్యాన్స్ సంతృప్తి చెందినప్పటికీ కామన్ ఆడియన్స్ మెప్పుని పూర్తి స్థాయిలో బాబీ పొందలేకపోయారు. ఈసారి అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా స్క్రిప్ట్ విషయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకున్నాడట. ప్రస్తుతానికి 2027 సంక్రాంతి రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకున్నఈ సినిమా వచ్చే దసరా లోపు పూర్తి చేయాలనే లక్ష్యంతో షెడ్యూల్స్ వేస్తున్నారు.
This post was last modified on October 13, 2025 10:17 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…