వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కబోయే సినిమా ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి బ్లాక్ బస్టర్లకు డైలాగులు రాసిన మాటల మాంత్రికుడు మొదటిసారి డైరెక్టర్ గా తమ హీరోని ఎలా హ్యాండిల్ చేస్తాడానే ఆసక్తి ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. హారికా హాసిని బ్యానర్ మీద రూపొందుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ఎంపికయ్యిందనే లీక్ ఆల్రెడీ చక్కర్లు కొడుతోంది. అధికారిక ప్రకటన రాలేదు కానీ కన్ఫర్మ్ అంటున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టు టైటిల్ పుట్టిస్తున్న డౌట్లు.
ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించి రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి వస్తున్నాయి. ఫస్ట్ ఆనందరావు అన్నారు. బాగానే ఉందనిపించింది. తర్వాత ఆనంద నిలయం అని మరొకటి పుట్టించారు. ఇది కూడా హోమ్లీగా ఓకే అనుకున్నారు సినీ ప్రియులు. తాజాగా అబ్బాయిగారు 60 ప్లస్ అని గత రెండు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడో సందేహం వస్తోంది 60 ప్లస్ అంటే హీరో వయసు ఆరు పదులు దాటిందని చూపిస్తున్నారాని. అదే నిజమైతే అప్పుడు సంక్రాంతికి వస్తున్నాం తరహాలో డ్యూయెట్లు, హుషారైన పాటలు కష్టం. లేదంటే వెంకీ డ్యూయల్ రోల్ చేస్తుండాలి. అంటే తండ్రి కొడుకుల్లాగా.
వీటిలో ఏది ఖరారో ఒక్క వెంకీ, త్రివిక్రమ్ లకు మాత్రమే తెలుసు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ప్యాన్ ఇండియా మూవీ ఉంది కాబట్టి ఇప్పుడు చేస్తున్న వెంకటేష్ మూవీని త్రివిక్రమ్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే ఇది అన్ని భాషల్లో సక్సెస్ అయ్యేలా తీయగలిగితే మార్కెట్ పరంగా తన బ్రాండ్ పెరగడంతో పాటు తారక్ తో చేయబోయే మూవీకి మరింత క్రేజ్ జోడిస్తుంది. వెంకటేష్ కు ఇలాంటి టెన్షన్లేమీ లేవు. మన శంకరవరప్రసాద్ గారు క్యామియోని ఇరవై రోజుల్లో పూర్తి చేసి ఎక్కువ సమయం త్రివిక్రమ్ శ్రీనివాస్ కే కేటాయించబోతున్నారు. 2026 సమ్మర్ రిలీజ్ ని టార్గెట్ గా పెట్టుకున్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates