Movie News

అనిరుధ్ బ్రాండ్ వేల్యూ తగ్గుతోందా

నిన్నటి దాకా ఏదైనా సినిమాకు అనిరుధ్ రవిచందర్ అని సంగీత దర్శకుడిగా పేరు ఉంటే చాలు ప్రాజెక్టుకు తెగ క్రేజ్ వచ్చేసేది. ఇప్పుడేదో తగ్గిందని కాదు కానీ వరస ఫ్లాపుల వల్ల మునుపటి స్థాయిలో నిర్మాతలు వెంటపడేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఫ్లాప్ సినిమాలకు సైతం తనదైన మార్కు పాటలు, బీజీఎమ్ ఇచ్చి ప్రత్యేకత చాటుకునే అనిరుధ్ కూలిలో మౌనిక మౌనిక తప్ప తన మేజిక్ ని పెద్దగా చూపించలేకపోయాడు. కంటెంట్ బాలేకపోవడం పక్కనపెడితే మదరాసికి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ మీద విమర్శలు వచ్చాయి. అంతకుముందు కింగ్డమ్ కూడా ఇంచుమించు ఇదే తరహా రెస్పాన్స్ అందుకుంది.

ఇప్పుడు దర్శకులు నిర్మాతలు కొత్త ఆప్షన్ల వైపు చూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ ఆల్రెడీ యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ వైపు  షిఫ్ట్ అయిపోయారు. అనిరుధ్ కోసం అర్రులు చాచాల్సిన అవసరం లేదనే తరహాలో ఇతర డైరెక్టర్లు కూడా ఆల్టర్నేటివ్స్  వైపు చూస్తున్నారు. అటు తమిళనాడులో సాయి అభ్యంక్కర్ క్రేజీగా మారుతున్నాడు. డ్యూడ్ ఇతని స్థాయిని పెంచేలానే ఉంది. అందుకే ఇకపై అనిరుధ్ పేరుని వాడుకోవడం ఇంతకు ముందులా ఇన్స్ టాంట్ హైప్ తెచ్చేలా లేదు. తాజాగా కిరణ్ అబ్బవరం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన సినిమాకు అనిరుధ్ వర్క్ చేయొచ్చని చెప్పుకోవడం అంతగా వెళ్ళలేదు.

ఇదంతా పక్కనపెడితే అనిరుధ్ రవిచందర్ చేత్లో అరడజను సినిమాలున్నాయి. రజనీకాంత్ జైలర్ 2, విజయ్ జన నాయకుడు, ప్రదీప్ రంగనాధన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, నాని ప్యారడైజ్, గౌతమ్ తిన్ననూరి మేజిక్, యష్ టాక్సిక్, షారుఖ్ కింగ్ ఈ లిస్టులో ఉన్నాయి. వీటిలో కనీసం ఒకటి రెండు చార్ట్ బస్టర్స్ కాగలిగితే అనిరుధ్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అని చెప్పుకోవచ్చు. లేదంటే హర్షవర్ధన్, సాయి అభ్యంక్కర్ లాంటివాళ్లు దూసుకెళ్ళిపోతారు. తమన్ ఓజితో కంబ్యాక్ అయ్యాడు. అఖండ 2, రాజా సాబ్ ప్రామిసింగ్ గా కనిపిస్తున్నాయి. ఇక మిగిలింది అనిరుధే. చూడాలి మరి ఏం చేయబోతున్నాడో.

This post was last modified on October 11, 2025 12:44 pm

Share

Recent Posts

జైలర్ జోరు ముగింపుకు వచ్చినట్టేనా

పెద్దగా ప్రమోషన్ల హడావిడి లేకుండా రిలీజ్ కు ముందు కాసింత నెగటివ్ వైబ్స్ తో వచ్చిన జైలర్ 2 అనూహ్యంగా…

2 hours ago

చంద్రబాబుపై కేటీఆర్ సాఫ్ట్ కార్నర్… ఏంటి మార్పు?

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది సామెత. అదిప్పుడు నిజమయ్యే సూచనలు కానవస్తున్నాయి. అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు…

10 hours ago

దర్శకుడిగా ఫెయిలయితే హీరోగా ఛాన్స్

తమిళనాడు సిఎం జోసెఫ్ విజయ్ వారసుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా తన తొలి ప్రయత్నం సిగ్మాతో చేయడం అది దారుణంగా…

10 hours ago

కమల్ హాసన్ నిజంగా అసాధ్యులే

లోకనాయకుడు కమల్ హాసన్ లేట్ ఏజ్ లోనూ తనదైన ప్లానింగ్ తో వాహ్ అనిపిస్తున్నారు. ఇది కేవలం సినిమాల్లో నటించడం…

11 hours ago

మెగావర్స్ కోసం మెగా మల్టీస్టారర్

ఇంకా విడుదల తేడా రాకుండానే, స్ట్రీమింగ్ జరగకుండానే చిరంజీవి టాక్ షో 'మెగా వర్స్' అభిమానుల్లో పెద్ద చర్చకు దారి…

11 hours ago

ఓదెల పరిధి తగ్గించుకుంటున్నాడా?

‘దసరా’ మూవీతో టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇచ్చాడు యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ శిష్యుడైన అతను.. డెబ్యూ…

12 hours ago