స్పిరిట్, కల్కి-2 లాంటి భారీ చిత్రాల నుంచి దీపికా పదుకొనే తప్పుకోవడం ఈ మధ్య సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘కల్కి’లో కీలక పాత్ర పోషించిన ఆమె.. రెండో భాగానికి దూరం కావడం చర్చనీయాంశం అయింది. ఇది ‘కల్కి’ టీంకు, ఆ సినిమాను ఇష్టపడ్డ వాళ్లకు ఎంతో ఇబ్బంది కలిగించే విషయమే. అదే సమయంలో దీపికకు కూడా అదంత మేలు కలిగించే నిర్ణయంలా అనిపించలేదు.
అయినా దీపిక ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందనే విషయంలో పెద్ద చర్చే జరిగింది. దీపిక డిమాండ్లకు తట్టుకోలేకే స్పిరిట్, కల్కి-2 టీమ్స్ ఆమెను తప్పించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. దీని గురించి దీపిక ఇప్పటిదాకా స్పందించలేదు. ఆమె పీఆర్ టీం మాత్రం సోషల్ మీడియా వేదికగా ఎదురుదాడి చేస్తూ వచ్చింది. ఇప్పుడు స్వయంగా దీపికే ఈ విషయం మీద స్పందించింది.
సినీ పరిశ్రమలో పని వాతావరణం గురించి ఆమె మాట్లాడింది. రోజుకు 8 గంటలే పని చేయాలని తనకు తాను ఒక నియమం పెట్టుకున్నానని.. దానికి అడ్జస్ట్ కాని వాళ్లు తనతో పని చేయాల్సిన అవసరం లేదని ఆమె తేల్చేసింది. అదే సమయంలో ఎప్పట్నుంచో 8 గంటలు మాత్రమే పని చేస్తున్న మగ సూపర్ స్టార్లు లేరా.. వాళ్లు శుక్రవారం వరకే పని చేసి, వీకెండ్స్ సెలవు తీసుకుంటారన్నది తెలియదా అని ఆమె ప్రశ్నించింది. ఐతే కేవలం ఈ ఒక్క కండిషన్ వల్లే దీపికాను స్పిరిట్, కల్కి-2 టీమ్స్ దూరం చేసుకున్నాయా అన్నది ప్రశ్న. 8 గంటల నిడివిలో దీపికతో పని చేయించుకోవడం వాళ్లకు పెద్ద సమస్యేమీ కాదు.
కానీ అంతకుమించి ఆమె పెట్టిన కండిషన్లకు, డిమాండ్లకు జడిసే ఆమెను దూరం పెట్టారన్నది స్పష్టం. ‘కల్కి’కి తీసుకున్న పారితోషకం కంటే దాదాపు 50 శాతం అదనంగా అడగడం నిజమా కాదా అన్నది ప్రశ్న. అలాగే దాదాపు 25 మంది దాకా ఉణ్న దీపిక స్టాఫ్‌కు ప్రయాణ, వసతి, ఇతర ఖర్చులు నిర్మాణ సంస్థే భరించాల్సిన పరిస్థితి రావడంతో.. ఇవన్నీ తట్టుకోలేకే ఆమెకు టాటా చెప్పారన్నది ఆయా చిత్ర వర్గాల సమాచారం. తన పీఆర్ టీం ద్వారా సెట్ చేసుకున్న ఇంటర్వ్యూలో కేవలం 8 గంటల పని విధానం గురించి మాత్రమే ప్రశ్న అడిగించుకుని.. దానికి ముందే ప్రిపేర్ చేసిపెట్టుకున్న జవాబు చెప్పి ఈ వివాదంలో తన తప్పేమీ లేదని చాటాలని దీపిక ప్రయత్నిస్తోందని క్లియర్‌గా తెలిసిపోతోంది. అందుకే దీపిక మీద మరోసారి సోషల్ మీడియాలో విమర్శలు తప్పట్లేదు.
This post was last modified on October 10, 2025 1:45 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…