ఓ యువ హీరోతో పాన్ ఇండియా సినిమా మొదలు పెట్టిన పూరి జగన్నాథ్ ఎప్పటిలా నాలుగైదు నెలలలో షూటింగ్ పూర్తి చేద్దామని చూసాడు. కానీ కరోనా లాక్‍డౌన్ వల్ల అప్పట్నుంచీ ఆ సినిమా షూటింగ్ జరగలేదు. మిగతా సినిమాలన్నీ మొదలవుతున్నా కానీ పూరి జగన్నాథ్ సినిమా మాత్రం ఇంతవరకు సెట్స్ మీదకు వెళ్లలేదు.
పూరి నిర్మాత అయితే ఇన్ని రోజులు ఖాళీగా వుండేవాడే కాదు. కానీ ఈ చిత్రానికి ఫండింగ్ కరణ్ జోహార్ ఇస్తున్నాడు. అతడికి ఎప్పుడూ చాలా సినిమాలు లైన్లో వుంటాయి. ప్రయారిటీ బేసిస్ మీద సినిమాలు పూర్తి చేస్తాడు. ఈ చిత్రానికి ఇంకా చాలా భాగం షూటింగ్ వుంది కనుక ఇప్పుడే షూటింగ్ మొదలు పెట్టాల్సిన పని లేదని అలా పక్కన వుంచాడు. దీంతో పూరి జగన్నాథ్ మరో సినిమా మొదలు పెట్టుకోలేక అలా వేచి చూస్తున్నాడు.
హిందీలో షూటింగ్స్ ఇంకా ఊపందుకోలేదు. ముంబయిలో కరోనా భయం తీవ్రంగా వుండడంతో బాలీవుడ్ తారలు ఇంకా ఇళ్లు దాటడం లేదు. పూర్తయ్యే దశలో వున్న చిత్రాలను మాత్రం ఎలాగోలా కంప్లీట్ చేసి ఓటిటికి ఇచ్చేస్తున్నారు. ఓ రకంగా పూరి జగన్నాథ్ లక్కీ అనుకోవాలి. అతని సినిమా పూర్తయి వుంటే కనుక కరణ్ ఈపాటికే ఓటిటి డీల్ చేసేసుకునేవాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates