ఆంధ్రప్రదేశ్ లో ఓజి టికెట్ రేట్లకు ఇచ్చిన ప్రత్యేక పెంపు అక్టోబర్ 4తో ముగిసింది. ఆదివారం నుంచి సాధారణ రేట్లతో ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. అంటే మల్టీప్లెక్స్ 177, సింగల్ స్క్రీన్ 110 నుంచి 145 రూపాయలకు టికెట్లు దొరికేస్తాయి. స్కూళ్ళు, కాలేజీల సెలవులు అయిపోతున్న నేపథ్యంలో ఆక్యుపెన్సీ పరంగా సండే చాలా కీలకం కానుంది. ఇప్పటిదాకా ప్రతి టికెట్ మీద 150, 100 రూపాయలు అదనంగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ కోసం ఖర్చు పెట్టుకున్న ఆడియన్స్ కి అతి పెద్ద ఊరట దక్కడంతో మళ్ళీ కలెక్షన్లు ఊపందుకుంటాయనే నమ్మకంతో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు.
కాకపోతే కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ రూపంలో ఓజికి పెద్ద స్పీడ్ బ్రేకర్ ఎదురయ్యింది. కేవలం వారం గ్యాప్ తో ఇంత పెద్ద సూపర్ హిట్ రావడం కలెక్షన్ల పరంగా ప్రభావం చూపించేదే. ఓజికి సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఇవ్వడం చాలా చోట్ల ఇబ్బందికరంగా మారగా కాంతారకు ఆ టెన్షన్ ఏది లేదు. ఏపీ తెలంగాణలో అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగా జరుగుతున్నాయి. కోర్టు తీర్పు పుణ్యమాని ఓజికి నాలుగో రోజే నార్మల్ రేట్లు పెట్టాల్సి రావడం ప్రేక్షకుల కోణంలో ప్లస్ కాగా ఏపీలో ఆలస్యం జరగడం పట్ల ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. మూడు వందల కోట్లు దాటేసిన ఓజికి ఇంకో పది రోజులు మంచి రన్ దక్కొచ్చు.
ఎలాగూ టికెట్ ధరలు సాధారణ స్థితికి చేరుకున్నాయి కాబట్టి దీన్ని మరింత బాగా ప్రొజెక్ట్ చేసుకుని మరో విడత ప్రమోషన్లు చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ అటు పాలనలో బిజీ అయిపోయారు. సక్సెస్ మీట్ కు హాజరు కావడంతో పబ్లిసిటీ పరంగా తన డ్యూటీని పూర్తి చేశారు. తమన్, సుజిత్ అమెరికా వెళ్తున్నారు. ప్రియాంక మోహన్ చెన్నై చేరుకుంది. శ్రియ రెడ్డిది కూడా అదే దారి. నిర్మాత దానయ్య ఒక్కరే ఏం చేయలేరు. సో లోకల్ ప్రమోషన్లకు ఎవరూ అందుబాటులో ఉండటం లేదు కాబట్టి ఉన్నంతలో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్సే అన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సోమవారం నుంచి ఆక్యుపెన్సీలు స్టడీగా ఉండటం ముఖ్యం.
Gulte Telugu Telugu Political and Movie News Updates