ఎంగేజ్మెంట్ జోష్.. రష్మిక నుంచి రిలీజ్ డేట్

రష్మిక మందన్నా పేరు నిన్నట్నుంచి సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. అందుక్కారణం టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో ఎంగేేజ్మెంట్ చేసుకోవడమే. కొన్నేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకుంది. ఇరు కుటుంబాల సభ్యుల మధ్య సింపుల్‌గా ఈ వేడుక జరిగిపోయింది. వచ్చే ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్సాహంలో చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న తన కొత్త చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించింది రష్మిక.

యాక్టర్ టర్న్డ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక.. ‘ది గర్ల్ ఫ్రెండ్’ అనేే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేసవిలోనే ఈ చిత్రం రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడింది. చివరికి సెప్టెంబరు 5న రిలీజ్ అన్నారు. కానీ ఆ డేట్‌ను కూడా అందుకోలేదు.

చాలా రోజులుగా అసలు చర్చల్లో లేకుండా పోయిన ఈ సినిమాను ఒక ప్రోమోతో వార్తల్లోకి తీసుకొచ్చింది చిత్ర బృందం. ఇంట్రెస్టింగ్‌గా సాగిన ఆ ప్రోమో ద్వారా నవంబరు 7న ఈ చిత్రం విడుదల కానుందని వెల్లడించారు. ఒక అబ్బాయికి అమ్మాయి.. లేదా ఒక అమ్మాయికి అబ్బాయి కరెక్ట్ అని ఎలా నిర్ణయిస్తారు అనే టాపిక్ మీద ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకున్న హీరో హీరోయిన్లు.. ఈ కన్ఫ్యూజన్ తీరాలంటే నవంబరు 7న థియేటర్లకు రండి మాట్లాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు.

ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ భాగస్వామ్యంలో విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మించారు. ఇందులో రష్మిక సరసన ‘దసరా’ ఫేమ్ ధీక్షిత్ శెట్టి శెట్టి కథానాయకుడిగా నటించాడు. ‘చి ల సౌ’తో మెప్పించి.. ‘మన్మథుడు-2’తో షాక్ తిన్న రాహుల్ రవీంద్రన్.. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని రూపొందించాడు.