మిరాయ్ 150 కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు పెట్టింది. పవన్ కళ్యాణ్ ఓజి వచ్చాక పూర్తిగా ఫైనల్ రన్ కు వచ్చేస్తుందని భావించిన ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తూ మూడో వారంలోనూ స్ట్రాంగ్ గా ఉండటం బయ్యర్ వర్గాలను సంతోషంలో ముంచెత్తుతోంది. నిజానికి మిరాయ్ లాంటి పాజిటివ్ టాక్ వచ్చిన మూవీకి ఇలాంటి వసూళ్లు ఆశ్చర్యం కలిగించేవి కాదు. కానీ టికెట్ రేట్లు ఒక్క రూపాయి పెంచకుండా ఏపీ తెలంగాణలో అనుమతి ఉన్న గరిష్ట ధరలనే ఫాలో అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దానికి తగ్గ గొప్ప ఫలితాన్ని అందుకుంది. ఇంకా ఫైనల్ రన్ దగ్గర పడలేదు. దసరా సెలవులు అయిపోయే దాకా కొనసాగుతుంది.
ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలు, నిర్మాతలు సీరియస్ గా విశ్లేషించుకోవాల్సిన అంశం ఒకటుంది. మొదటి వారంలోనే మొత్తం వచ్చేయాలి, బ్రేక్ ఈవెన్ దాటేయాలనే తాపత్రయంలో ఈ మధ్య ప్రొడ్యూసర్లు బడ్జెట్ తో సంబంధం లేకుండా హైక్స్ తెచ్చేసుకుంటున్నారు. ప్రతిసారి ఇది లాభం చేకూర్చదు. ఓజికి బ్రహ్మాండంగా పనికొచ్చిన ఈ వ్యవహారం అదే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి స్పీడ్ బ్రేకర్ అయ్యింది. కింగ్డమ్ అనుకున్న దానికన్నా ఫ్లాప్ కావడం వెనుక, హిట్ 3కి హిట్ టాక్ వచ్చినా లాంగ్ రన్ రాకపోవడానికి కారణం కేవలం ఈ పెంపుల దందానే. కానీ మిరాయ్ ఈ భ్రమలన్నీ తొలగించి అదిరిపోయే కలెక్షన్లతో వావ్ అనిపించింది.
డబ్బింగ్ సినిమాలకు సైతం వంద రూపాయల పెంపు తెచ్చుకుంటున్న పరిస్థితుల్లో మిరాయ్ కచ్చితంగా ఒక రోల్ మోడల్ కానుంది. ఒకవేళ ఇది కూడా పెంపులతో రిలీజ్ అయ్యుంటే ఇంకో యాభై కోట్లు అదనంగా వచ్చేది కానీ ఎక్కువ శాతం చూడాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం అంతకన్నా విలువైన పాఠాలు నేర్పించింది. ప్యాన్ ఇండియా సినిమాలు, వందల కోట్లు ఖర్చు పెట్టిన గ్రాండియర్లు వీటికి అడగటంలో తప్పు లేదు. కానీ మీడియం రేంజ్, పక్క భాషలో తీసి ఇక్కడ అనువాదం చేసినవాటికీ పెంచడం అసలు సమస్య. మిరాయ్ మిగిలిన వాళ్ళను కూడా ఇన్స్ పైర్ చేస్తే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates