ఇటీవలే తమిళనాడు రాష్ట్రం కరూర్ లో విజయ్ రాజకీయ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలభై ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. డ్యామేజ్ ని తగ్గించే ఉద్దేశంతో విజయ్ వదిలిన వీడియో మెసేజ్ కు సానుకూలత, వ్యతిరేకత రెండూ రావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చనిపోయిన వాళ్లకు క్షమాపణ చెప్పడం కన్నా స్టాలిన్ సర్కార్ తన పార్టీ వ్యక్తులను టార్గెట్ చేయడం పట్ల విచారం వ్యక్తం చేయడమే ఎక్కువగా కనిపించిందని కొందరు విమర్శించడం సోషల్ మీడియాలో వైరలయ్యింది.
ఈ ఘటన తాలూకు ప్రభావం జనవరి 9 విడుదల కాబోయే జన నాయకుడు మీద ఉంటుందని అభిమానులు అనుమాన పడుతున్నారు. అపోజిషన్ పార్టీలు ఏకమై ఈ సినిమాని బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తారని వాళ్ళ అనుమానం. లీగల్ గా నిషేధించడానికి ఛాన్స్ లేదు కానీ రకరకాల మార్గాల్లో అడ్డుకునే అవకాశాలు లేకపోలేదు. అసలే కరూర్ ప్రమాదం వెనుక కుట్ర ఉందని, ఏకంగా రూలింగ్ పార్టీ మీదే అనుమానం వచ్చేలా మాట్లాడుతున్న విజయ్ కు దాని సెగలు సినిమా రిలీజ్ టైంలో ఎదురుకావొచ్చు. సెన్సార్ తో మొదలుపెట్టి థియేటర్ల కేటాయింపు దాకా సవాలక్ష సమస్యలను చవి చూడాల్సి రావొచ్చు.
తన రాజకీయ ప్రవేశానికి ముందు చేసిన చివరి సినిమాగా జన నాయకుడుకి విజయ్ చాలా బజ్ తీసుకొచ్చాడు. హెచ్ వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మన భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం కొన్ని నెలల క్రితం బలంగా తిరిగింది. ఒకవేళ పాయింట్ కొంచెం తీసుకున్నప్పటికీ ట్రీట్ మెంట్ పూర్తిగా వేరు ఉంటుందని కోలీవుడ్ టాక్. అయితే పొలిటికల్ గా ఇందులో చాలా సెటైర్లు, సంఘటనలు ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. అదే నిజమైతే డీఎంకే నేతలు ఊరికే ఉండరు. ఖచ్చితంగా అడ్డుకుంటారు. రాబోయే నెలల్లో జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయనేది వాస్తవం.
This post was last modified on October 1, 2025 6:07 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామ పరిధిలోని ఓఎన్జీసీ మోరి-5 డ్రిల్లింగ్ సైట్లో గత కొన్ని రోజులుగా ప్రజలను భయాందోళనకు గురిచేసిన…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గతంలో సంక్రాంతి సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…