జబర్దస్త్ కామెడీ షోతో మాంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు.. సుడిగాలి సుధీర్. ఆ షోలో వందల కొద్దీ స్కిట్లతో అతను ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇంకా కొన్ని టీవీ షోల్లో తన ప్రతిభను చాటుకున్న అతను.. అనేక సినిమాల్లోనూ నటించాడు. సుధీర్ హీరోగానూ నాలుగు సినిమాలు చేయడం విశేషం. కానీ అవేవీ అతడికి ఆశించిన విజయాలు అందించలేదు. ‘గాలోడు’ సినిమాకు మాత్రం ఓ మోస్తరుగా వసూళ్లు వచ్చాయి.
చివరగా ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమా చేసిన సుధీర్.. తర్వాత బ్రేక్ తీసుకున్నాడు. ఇప్పుడతను మళ్లీ హీరోగా సినిమా చేయబోతున్నాడు. ఈసారి అతను చేస్తోంది పాన్ వరల్డ్ మూవీ అట. ఈ రోజే ఆ సినిమా టైటిల్‌ను పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్లో చైనీస్, జపనీస్.. ఇలా అంతర్జాతీయ భాషల్లో టైటిల్‌ను రివీల్ చేశారు. తెలుగు టైటిల్ సోమవారం ప్రకటిస్తారట.
ఏఐ సాయంతో ఈ టైటిలేంటో నెటిజన్లు కనిపెట్టేశారు. ‘హైలెస్సో’ అనే టైటిల్‌తో రాబోతున్నాడు సుడిగాలి సుధీర్. ఈ చిత్రానికి దర్శకుడెవరో ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ నిర్మాత ఎవరో వెల్లడైంది. మెగా ఫ్యాన్ అనే ముద్రతో చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో తిరుగుతున్న శివ చెర్రీ ఈ చిత్రంతో నిర్మాతగా పరిచయం కానున్నాడు. కొన్నేళ్ల పాటు సందీప్ కిషన్ పీఆర్ వ్యవహారాలు చూసిన శివ.. ఆ తర్వాత రామ్ చరణ్ కాంపౌండ్లోకి వెళ్లాడు.
చరణ్ అభిమాన సంఘాలను నడిపిస్తూ, పీఆర్ వ్యవహారాలు చూసుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. నిర్మాత ఎస్కేఎన్ కూడా ఇలా ఎదిగిన వాడే. ఆ బాటలోనే శివ చెర్రీ కూడా ఇప్పుడు నిర్మాత అవుతున్నాడు. ‘వజ్ర వారాహి సినిమాస్’ పేరుతో నిర్మాణ సంస్థను పెట్టి చెప్పుకోదగ్గ బడ్జెట్లోనే ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నాడు శివ చెర్రీ.
This post was last modified on September 28, 2025 11:42 pm
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…