రెండు తెలుగు రాష్ట్రాల్లో మామూలుగానే టికెట్ల ధరలు తక్కువేమీ కాదు. దేశం మొత్తంలో అధిక రేట్లున్న రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ ముందు వరుసలోనే ఉంటాయి. అయినా సరే.. ఉన్న రేట్లు సరిపోవని.. కాస్త క్రేజున్న ప్రతి సినిమాకూ అదనపు రేట్లు వడ్డించడం మామూలైపోయింది. వందల కోట్లు ఖర్చు పెట్టి, ఎంతో భారీగా తీసిన సినిమాలకు ఎక్స్‌ట్రా రేట్లు పెట్టినా ఓకే కానీ.. మామూలు చిత్రాలకు కూడా రేట్లు వడ్డిస్తుండడం జనాల్లో వ్యతిరేకతకు దారి తీస్తోంది.
మరీ విడ్డూరమైన విషయం ఏంటంటే.. డబ్బింగ్ సినిమాలకు సైతం అదనపు రేట్లు అడగడం, ప్రభుత్వాలు ఓకే చెప్పడం. గత నెలలో వచ్చిన వార్-2, కూలీ రెండూ డబ్బింగ్ సినిమాలే. అయినా వాటికి ఏపీలో రేట్లు పెంచారు. ఇప్పుడు మరో అనువాద చిత్రానికి ఎక్స్‌ట్రా రేట్ల కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం కూడా జీవో ఇవ్వబోతోందనే ప్రచారం సాగుతుంది. ఆ మూవీనే.. కాంతార: చాప్టర్-1.
‘కాంతార’ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ‘కాంతార: చాప్టర్-1’ మీద అంచనాలు పెరిగాయి. బిజినెస్ కూడా గట్టిగా జరిగింది. మరి సినిమాకు హైప్ పెరగడానికి కారణం ఎవరు? ప్రేక్షకులే కదా? వాళ్లలో అంచనాలు పెరగడం వల్లే కదా రేటు పెరిగింది, అందుకే భారం కూడా వాళ్ల మీదే వేద్దామని అనుకుంటున్నట్లున్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే ఒక సినిమా పట్ల హైప్ పెంచుకోవడమే ప్రేక్షకుల పాపం అన్నమాట.
ఓవైపు థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోందని.. వెండితెరల భవిష్యత్ ఏంటి అంటూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇంకోవైపు ఏదైనా సినిమాను థియేటర్లకు వచ్చి చూద్దాం అనుకుంటే.. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ రేట్లు పెంచేస్తారు. డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు ఎలా అనుమతి ఇస్తాయన్నదే అంతుబట్టని విషయం. తెలంగాణలో ‘ఓజీ’కి టికెట్ల ధరలు పెంచడం మీద రచ్చ జరిగిన నేపథ్యంలో ‘కాంతార-2’ సహా ఇకపై ఏ చిత్రానికీ అదనపు రేట్లు ఉండవని తెలుస్తోంది.
This post was last modified on September 29, 2025 9:08 am
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…