సలార్ ఇంటర్వెల్ ఎపిసోడ్ అంతగా పేలడానికి ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఒక కారణమైతే, అంతే సమానంగా ఆర్టిస్ట్ శ్రీయ రెడ్డి బిగ్గరగా దేవరత మన్నార్ అంటూ ఎలివేషన్లు ఇచ్చిన తీరు థియేటర్లు హోరెత్తిపోయేలా చేసింది. ఝాన్సీతో మెల్లగా మాట్లాడుతూ క్రమంగా గొంతుని పెంచుతూ ఆవిడ డైలాగు చెప్పిన విధానం ఓ రేంజ్ లో పేలింది. తర్వాత టాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చినా తొందరపడి ఒప్పుకోకుండా కేవలం పవన్ కళ్యాణ్ ఓజికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులోనూ మరీ ఎక్కువ స్పేస్ దొరకలేదు. కానీ ఉన్నంతలో గుర్తుండిపోయే సన్నివేశాలు పడాయి. ముఖ్యంగా విలన్ తో నవ్వుతూ పవన్ గురించి చెప్పే సీన్ లో.
ఒకరకంగా చెప్పాలంటే ఈ రెండు క్యారెక్టర్లు నిడివి పరంగా చిన్నవి. కానీ చూపించిన ప్రభావం మాత్రం పెద్దవి. ఇంకా ఎడిటింగ్ లో కొంత భాగం పోయిందంటున్నారు కాబట్టి అందులోనూ శ్రీయ రెడ్డికి తగినంత స్కోప్ దొరికి ఉండొచ్చు. హీరో విశాల్ కు స్వయానా వదినైన శ్రీయ రెడ్డి 2003లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. రాజా హీరోగా రూపొందిన అప్పుడప్పుడు సినిమా కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేదు. ఆ తర్వాత మూడేళ్లకు అమ్మ చెప్పిందిలో నటించినా ఫలితం డిజాస్టరే. విశాల్ పొగరుతో శ్రీయ రెడ్డికి చాలా పేరొచ్చింది. హీరో వద్దన్నా వెంటపడే శాడిస్ట్ పాత్రలో జీవించేసి మాస్ ఆడియన్స్ కి దగ్గరయ్యింది.
ఆ సమయంలోనే విశాల్ అన్నయ్య విక్రమ్ తో ప్రేమలో పడటం అది వివాహానికి దారి తీయడం జరిగిపోయాయి; ఇరవై మూడు సంవత్సరాల సుదీర్ఘ కెరీర్ లో శ్రీయ రెడ్డి నటించిన సినిమాలు ఇరవై కూడా లేవు. కాకపోతే క్వాలిటీ ఉన్నవే ఎక్కువ. కాంచీవరంలో నటనకు ఫిలిం ఫేర్, విజయ్ అవార్డులకు నామినేట్ అయినా పురస్కారం రాలేదు. మొన్న ఏడాది వెబ్ సిరీస్ సుజల్ తనకు చాలా పేరు తీసుకొచ్చింది. సలార్, ఓజిలు చూసిన ఇతర దర్శక నిర్మాతలు శ్రీయ రెడ్డికు అవకాశాలు ఇస్తున్నారు కానీ ఆవిడే ఒక పట్టాన ఒప్పుకోవడం లేదట. ప్రభాస్, పవన్ రేంజ్ స్టార్లైతేనే రెస్పాన్స్ వేగంగా ఉంటుందేమో.
This post was last modified on September 27, 2025 9:51 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…