ఇవాళ దేవర విడుదలై ఏడాది గడిచిన సందర్భంగా ఆ బ్లాక్ బస్టర్ జ్ఞాపకాలను అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ ఒక పోస్టర్ తో పాటు దేవర 2 త్వరలోనే ప్రారంభమవుతుందనే రీతిలో మెసేజ్ పెట్టడంతో ఫ్యాన్స్ యాక్టివ్ అయిపోయారు. నిజానికి దేవర 2 ఉండదని, కొరటాల శివ వేరే ప్రాజెక్టుకు వెళ్ళిపోతున్నాడని, నాగచైతన్యతో చర్చలు జరిగాయని ఇలా రకరకాల లీకులు ప్రచారం జరిగాయి. కానీ దేవరని విపరీతంగా ఇష్టపడిన జూనియర్ ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లో సీక్వెల్ ని పక్కనపెట్టే ఆలోచనలో లేడని గతంలోనే టాక్ వచ్చింది. ఇప్పుడది నిజమైపోయింది.
సరే వినడానికి బాగానే ఉంది కానీ ఇంతకీ దేవర 2 ఎప్పుడు స్టార్ట్ అవొచ్చు ఎప్పుడు రిలీజనే విశ్లేషణకు వద్దాం. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్న తారక్ దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్, నెల్సన్ దిలీప్ కుమార్ కు కమిట్ మెంట్స్ ఇచ్చాడు. కొరటాల శివ దేవర 2 స్క్రిప్ట్ ని పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనులను ఒక కొలిక్కి తెస్తున్నాడని ఆల్రెడీ టాక్ ఉంది. త్రివిక్రమ్ ముందు వెంకటేష్ సినిమా పూర్తి చేయాలి. ఇంకా సెట్స్ పైకే వెళ్ళలేదు. విఎఫెక్స్ డిమాండ్ చేసే సబ్జెక్టు కాదు కాబట్టి 2026 వేసవికల్లా పూర్తయిపోతుంది. ఆ తర్వాత తారక్ తో చేయబోయే ఫాంటసీ మూవీ రైటింగ్ మొదలుపెట్టాలి.
ఇక నెల్సన్ దిలీప్ కుమార్ విషయానికి వస్తే రజనీకాంత్ జైలర్ 2 వచ్చే సంవత్సరం జూన్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అప్పటిదాకా అతనూ ఫ్రీ కాడు అంటే వీళ్లిద్దరి కంటే ఎక్కువ ఛాన్స్, తగినంత సమయం ఉన్నది కొరటాల శివకే కాబట్టి దేవర 2ని వెంటనే మొదలుపెట్టొచ్చు. ఎలాగూ సెట్స్ సిద్ధంగా ఉన్నాయి, ఆర్టిస్టుల డేట్స్ ని తీసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా జాన్వీకపూర్, సైఫ్ అలీ ఖాన్ తో పాటు బాబీ డియోల్ కాల్ షీట్లు సమన్వయం చేసుకోవాలి. దేవర 2 మీద భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో కొరటాల శివ మొదటి భాగం మీద వచ్చిన కంప్లయింట్స్ రిపీట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారట.
This post was last modified on September 27, 2025 1:13 pm
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…
సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…
వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…