నిజానికి ఓజి మీద ఇంత హైప్ రావడానికి కారణం రాజమౌళి లాంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ కాదు. ప్రశాంత్ నీల్ అనే క్రేజీ కాంబో కాదు. కేవలం రెండు సినిమాల అనుభవమున్న సుజిత్ అనే పవన్ కళ్యాణ్ సెట్ చేసుకున్న సెటప్, ఎవరికీ రాని ఐడియాతో ఓజాస్ గంభీరా అలియాస్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ ని ఊహించుకోవడం. ఈ రెండూ గొప్ప ఫలితాన్ని ఇచ్చాయి. నిజానికి పవన్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో నటించడం కొత్త కాదు. గతంలో పంజా, బాలు చేశారు. కానీ ఆ రెండు ఫెయిలయ్యాయి. సక్సెస్ ట్రాక్ లో దర్శకుడు విష్ణువర్ధన్, కరుణాకరన్ ఇద్దరూ పవన్ ని హ్యాండిల్ చేయలేకపోయారు. బహుశా కోలీవుడ్ కు చెందినవాళ్లు కావడమేమో.
అయితే ఓజిని మోసింది తెలుగువాడు. కరుడుగట్టిన పవన్ వీరాభిమాని. తన ఊహల్లో కలల్లో హీరోని ఎలా చూడాలని కోరుకుంటున్నాడో అచ్చంగా దాన్నే తెరమీద ఆవిష్కరించాడు. పోలీస్ స్టేషన్ సీన్, ఇంటర్వెల్ బ్లాక్, ఇంట్రో ఫైట్, క్లైమాక్స్ గురించి జనం పదే పదే మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం వాటిని హ్యాండిల్ చేసిన విధానం. పవన్ లాంటి స్టార్ కి ఎలాంటి ఎలివేషన్లు ఇవ్వాలో తెలియక తప్పు చేసిన డైరెక్టర్లే ఎక్కువ, బ్రో కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. కానీ సుజిత్ తప్పు చేసే అవకాశం ఇవ్వలేదు. అఫ్కోర్స్ సెకండాఫ్ కంటెంట్ మీద కామెంట్స్ ఉన్నాయి కానీ ఫైనల్ గా నిరాశపరచలేదన్నది వాస్తవం.
ఇలా అభిమానులే హీరోలను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఓజి మంచి ఉదాహరణగా నిలుస్తోంది. తమిళంలో కమల్ హాసన్ ని లోకేష్ కనగరాజ్ సినిమా చేసినప్పుడు ఎక్కువ శాతం నెగటివ్ గానే మాట్లాడుకున్నారు. కానీ బాక్సాఫీస్ ఫలితం రికార్డులు బద్దలు కొట్టింది. ఓజి ఆ స్థాయికి వెళ్తుందా లేదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. వెయ్యి రూపాయలు టికెట్ రేట్ పెట్టినా తండోపతండాలుగా వచ్చిన జనాలను చూసి నిర్మాతలకు నోటమాట రావడం లేదు. వీకెండ్ దాకా ఓజి డామినేషన్ ఇవ్వడం ఖాయం. మూడో వారంలో ఉన్న మిరాయ్ శుక్రవారం నుంచి మళ్ళీ థియేటర్లకు వచ్చేస్తుంది. సుజిత్ నమ్మకాన్నైతే నిలబెట్టు కున్నాడు.
This post was last modified on September 25, 2025 5:19 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…