నిన్న రాత్రి పది గంటల నుంచి ఏపీ తెలంగాణ థియేటర్లలో గేట్లు మూసేసి సిబ్బంది ఇంటికి వెళ్లిపోవడం, షోలు అయిపోయాయి కాబట్టి ఇవాళ్టికే దుకాణం బంద్ లాంటివి అనుకోవడం జరగలేదు. జాతరను తలపించేలా ప్రతిచోటా ప్రీమియర్ల కోసం అభిమానులు చేసిన సందడి తాలూకు వీడియోలతో సోషల్ మీడియా నిండిపోయింది. చాలా గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ మాస్ హిస్టీరియాని చూసి ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఇంటర్వెల్ కే సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు పలుచోట్ల కనిపించాయి. ఇన్నేళ్ల ఎదురు చూపులకు దర్శకుడు సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ న్యాయం చేకూర్చారంటూ సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ విమల్, శ్రీరాములు థియేటర్లు టాలీవుడ్ సెలబ్రిటీలతో నిండిపోయాయి. ప్రశాంత్ నీల్, సందీప్ రెడీ వంగా, సాయి ధరమ్ తేజ్, హరీష్ శంకర్, కిరణ్ అబ్బవరం, వరుణ్ తేజ్, వైష్ణవ్, అకీరానందన్, ఎస్కెఎన్, సాయిరాజేష్ తదితరులంతా సామాన్య అభిమానుల్లా ఆట టైంకి వచ్చేసి సీట్లలో కూర్చోవడం కనిపించింది. హరిహర వీరమల్లు గాయాన్ని పూర్తిగా మర్చిపోయేలా ఓజి ఉందని టాక్ అయితే పాజిటివ్ గా ఉంది. దీన్ని ఎంత బలంగా నిలబెట్టుకుంటుందనేది కీలకం కానుంది. నాలుగు రోజుల సుదీర్ఘ వీకెండ్ ని ఓజి వాడుకోవడం మీదే ఎలాంటి రికార్డులు బద్దలవుతాయనేది ఆధారపడి ఉంది.
ఆన్ లైన్ ట్రెండ్స్ చూస్తుంటే ఓజికి మినిమమ్ సూపర్ హిట్ ముద్ర పడిపోయింది. బ్లాక్ బస్టర్ స్థాయిని చేరుకుంటుందా లేదానేది బ్రేక్ ఈవెన్ ని వేగంగా అందుకోవడాన్ని బట్టి ఉంటుంది. హైదరాబాద్ లో మంచి స్క్రీన్లు, ప్రీమియం మల్టీప్లెక్సుల్లో షోలన్నీ సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. ఇదే జోరుని నాలుగు రోజులు కొనసాగిస్తే సగానికి పైగానే రికవర్ అయ్యే అవకాశాలున్నాయి. పుష్ప 2, ఆర్ఆర్ఆర్ రేంజ్ లో ఓజి నిలబడటం చాలా అవసరం. ఎందుకంటే వారం తర్వాత కాంతార చాప్టర్ 1, ఇడ్లీ కొట్టు వస్తున్నాయి. రెండూ డబ్బింగ్ కాబట్టి టెన్షన్ అవసరం లేదని అనుకోవడానికి లేదు. ఓజిలాగే వాటికి మంచి టాక్ వస్తే పోటీ ఉంటుంది.
This post was last modified on September 25, 2025 11:51 am
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…