Movie News

ఓజీ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంత?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చివరి చిత్రం ‘హరిహర వీరమల్లు’కు థియేట్రికల్ హక్కుల విషయంలో నిర్మాత చెప్పిన రేట్లకు, బయ్యర్లు అడిగిన ధరలకు అసలు పొంతనే లేదు. చివరికి బయ్యర్ల మాటే నెగ్గి వాళ్లు కోట్ చేసిన రేట్లకే సినిమాను ఇవ్వాల్సి వచ్చింది. చివరికి చూస్తే వాళ్లు దక్కించుకున్న తక్కువ రేట్లకు కూడా సినిమా గిట్టుబాటు చేయలేకపోయింది. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ 40 శాతానికి తక్కువ కాకుండా నష్టాలు తప్పలేదు. కానీ ఇంకో రెండు నెలల తర్వాత రిలీజవుతున్న ‘ఓజీ’ విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమాను బయ్యర్లు ఫ్యాన్సీ రేట్లు పెట్టి కొన్నారు.

‘హరిహర వీరమల్లు’తో పోలిస్తే 70-80 శాతం మేర అధికంగా దీనికి బిజినెస్ జరగడం విశేషం. అయినా సరే బయ్యర్లకు రిస్కేమీ కనిపించడం లేదు. సినిమాకు టాక్ ఎలా ఉన్నప్పటికీ బ్రేక్ ఈవెన్ అయిపోయేలా ఉంది. ఇక పాజిటివ్ టాక్ వస్తే మంచి లాభాలూ ఖాయం.

ఇంతకీ బాక్సాఫీస్ దగ్గర ‘ఓజీ’ టార్గెట్ ఎంత అన్నది ఆసక్తికరం. అది రూ.170 కోట్లు షేర్ అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ఏరియాలూ కలిపి రూ.100 కోట్ల మేర బిజినెస్ అయింది ‘ఓజీ’కి. అందులో సీడెడ్ వాటా పాతిక కోట్ల దాకా ఉండొచ్చు. తెలంగాణ రైట్స్‌ రూ.55 కోట్లు తెచ్చిపెట్టాయి. ఓవర్సీస్ హక్కులను చాలా ముందుగా కొంచెం తక్కువ మొత్తానికే దక్కించుకున్నారు. ఐతే సినిమా ఆలస్యం కావడం వల్ల వడ్డీల భారం పడి ఓవరాల్ రైట్స్ రేటు పెరిగినట్లు భావించాలి.

ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా హక్కులు రూ.25 కోట్లకు అటు ఇటుగా వాల్యూ చేయొచ్చు. ఇలా మొత్తం థియేట్రికల్ హక్కులు రూ.160 కోట్ల మేర పలికాయి. పబ్లిసిటీ, అదనపు ఖర్చులు కలిపితే లెక్క రూ.180 మేర షేర్ రాబట్టాల్సి ఉండొచ్చు. అంటే ‘ఓజీ’ వరల్డ్ వైడ్ రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశముంది. ఆ లెక్కను దాటి వచ్చేది లాభం అన్నమాట. ఓజీ డే-1 గ్రాసే రూ.100 కోట్లను దాటిపోవడం ఖాయం. సినిమాకు టాక్ బాగుంటే దసరా సెలవుల్లో వసూళ్ల మోత మోగించి రికార్డ్ బ్రేకింగ్ రీజనల్ మూవీగా నిలిచే అవకాశాలున్నాయి.

This post was last modified on September 24, 2025 12:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

3 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

5 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

7 hours ago