కెజిఎఫ్ తర్వాత శాండల్ వుడ్ లో ఆ స్థాయి అంచనాలు మోస్తున్న సినిమా కాంతార చాప్టర్ 1 ది లెజెండ్. మొదటి భాగం కేవలం పదహారు కోట్లతో తీస్తే నాలుగు వందల కోట్ల దాకా వసూలు చేయడం చరిత్ర. తెలుగులో రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ చేసినా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని డిస్ట్రిబ్యూటర్లకు రూపాయికి నాలుగు రూపాయలు తేవడం డబ్బింగ్ చిత్రాల్లో కొత్త ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అక్టోబర్ 2 దీనికి ప్రీక్వెల్ రానుంది. ప్రమోషన్ల విషయంలో ఇప్పటిదాకా పెద్దగా సౌండ్ చేయని కాంతార చాప్టర్ 1 ఇవాళ్టి నుంచి పబ్లిసిటీకి శ్రీకారం చుట్టింది. తెలుగులో ప్రభాస్ తో పాటు ఇతర బాషల స్టార్లతో ట్రైలర్ లాంచ్ చేయించింది.
ఫస్ట్ పార్ట్ ఎక్కడ ఆపారో అక్కడి నుంచి ఈ సినిమా మొదలవుతుంది. పంజుర్లి జాతర తర్వాత హఠాత్తుగా అడవిలో మాయమైన తండ్రి కాంతార (రిషబ్ శెట్టి) గురించి తెలుసుకోవటానికి పూనుకుంటాడు కొడుకు శివ (రిషబ్ శెట్టి). దాని వెనుక దశాబ్దాల చరిత్ర ఉందని అర్థమవుతుంది. పంజుర్లి ప్రాంతాన్ని రాజులూ ఏలే కాలంలో ఆ కారడివి మొత్తం వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. గిరిజన తండాలో ఉండే వీరుడు, దైవ కోల ఆటగాడు కాంతార ఏకంగా యువరాణినే ప్రేమిస్తాడు. ఇది రెండు వర్గాల మధ్య చిచ్చు రేపితే జరిగిన యుద్ధంలో కొన్ని అనూహ్య రహస్యాలు బయటపడతాయి. కాంతార లక్ష్యం మారిపోతుంది. అదేంటనేది తెరమీద చూడాలి.
హీరో కం దర్శకుడు రిషబ్ శెట్టి ఈసారి బ్యాక్ డ్రాప్ మొత్తం ఫారెస్ట్ కి మార్చేశారు. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం అధిక శాతం పల్లెటూరిలో సాగితే ఇప్పుడీ కొనసాగింపు అడవులు, తెగలు, ప్రాణాంతక మృగాలు, గుహలు, కొండలు, కోనల్లో జరుగుతుంది. రిషబ్ శెట్టి ఆశించినట్టే టెర్రిఫిక్ గా ఉన్నాడు. మూడు నిమిషాల ట్రైలర్ లో కథకు సంబంధించిన డీటెయిల్స్ మరీ ఎక్కువ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డారు. దేవుడికి సంబంధించి శివుడి ఎలిమెంట్ తీసుకున్న రిషబ్ శెట్టి యాక్షన్ ఎపిసోడ్స్, క్లైమాక్స్ తో మరోసారి గూస్ బంప్స్ ఇచ్చేలా ఉన్నారు. ఇదే స్థాయిలో సినిమా కూడా ఉంటే కాంతార చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ కొట్టినట్టే.
Gulte Telugu Telugu Political and Movie News Updates