ప్రముఖ నిర్మాణ సంస్థ, ఓజి ప్రొడక్షన్ హౌస్ డివివి ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాత దానయ్య వారసుడు కళ్యాణ్ దాసరి హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యునివర్స్ లో భాగంగా ఆయన పర్యవేక్షణలో శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. నిజానికిది ఇప్పుడు లాక్ చేసుకున్న ప్రాజెక్టు కాదు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతున్న టైంలో ప్రకటించారు. అప్పుడు ప్రశాంత్ వర్మనే దర్శకుడు. హనుమాన్ రిలీజయ్యాక లెక్కలు మారిపోవడంతో అధిరకి డైరెక్టర్ కూడా ఛేంజ్ అయ్యాడు. ఓజి అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో హఠాత్తుగా దీని ప్రకటన ఇవ్వడం గమనార్హం.
టీజర్ కాదు కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. అందులో కళ్యాణి దాసరి సూపర్ హీరోగా వేసుకున్న గెటప్ కల్కిలో ప్రభాస్ ని పోలి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. విలన్ గా చేస్తున్న ఎస్జె సూర్యని ఏదో యముడు తరహాలో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేశారు. కథాపరంగా కల్కికి దీనికి కంపారిజన్ ఉండకపోవచ్చు కానీ గెటప్ దగ్గర కనిపిస్తున్న సారూప్యతలు డౌట్లు రేపుతున్నాయి. మాములుగా సూపర్ హీరోల బేసిక్ స్టోరీ పాయింట్ ఒకటే ఉంటుంది. తమ బలం తమకు తెలియకుండా సామాన్యుల్లో ఉండటం, శక్తి తెలిశాక శత్రువుల అంతం చూసేందుకు విచిత్రమైన డ్రెస్సు వేసుకుని చిన్నా పెద్దాని మెస్మరైజ్ చేయడం వీటిలో ప్రధానాంశం.
విడుదల ఇంకా ఖరారు చేయలేదు కానీ కొడుకుని పెద్ద ఎత్తున పరిచయం చేయాలని చూస్తున్న దానయ్యకు మంచి సెటప్ దొరికింది. నిర్మాత ఆయన కాకపోయినా అనుభవరిత్యా కొడుక్కి సలహాలు ఇస్తూ ఉంటారు. మాములుగా నిర్మాతల కొడుకు హీరోగా సెటిల్ కావడం చాలా తక్కువ. రామానాయుడు గారి వారసత్వాన్ని వెంకటేష్ నటన రూపంలో నిలబడేదితే సురేష్ బాబు సంస్థని మరింత పైకి తీసుకెళ్లారు. మరి కళ్యాణ్ దాసరి కూడా అదే బాటలో వెళ్తాడేమో చూడాలి. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న అధీరని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశాలున్నాయి. రిలీజ్ డేట్ ఇంకా లాక్ చేసుకోలేదు.
This post was last modified on September 22, 2025 12:35 pm
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…