కొండంత ఆశలు పెట్టుకుని, వ్యయ ప్రయాసలు కోర్చి ఓజి ఈవెంట్ కొచ్చిన అభిమానులకు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చిన కిక్ లేకపోయి ఉంటే ఇవాళ సోషల్ మీడియా మొత్తం ఓజి మీద కత్తులు మిరియాలు నూరేది. అలాని అసంతృప్తి లేదని కాదు. చాలా విషయాల్లో ఇది బయట పడుతూనే ఉంది. ట్రైలర్ ఇప్పటిదాకా రాలేదు. వేడుకలో నేరుగా లాంచ్ చేస్తామన్నారు. ఏదో రఫ్ వెర్షన్ తో సరిపుచ్చారు తప్పించి ఫైనల్ కట్ చూపించలేదు. అన్నపూర్ణ స్టూడియోస్ లో చివరి నిమిషం కరెక్షన్లు జరుగుతున్నాయనే సమాచారం తప్ప ఇంకెలాంటి అప్డేట్ లేకపోయింది. తమన్ రాత్రి వస్తుందన్నాడు కానీ ఎంత ఎదురు చూసినా జరగలేదు.
ఇప్పుడీ జాప్యానికి మూల్యం ఎవరు చెల్లించారంటే ముమ్మాటికీ ఫ్యాన్సే. ఎందుకంటే గంటల తరబడి విలువైన సమయాన్ని ఓజి కోసం ఖర్చు పెట్టేశారు. లేట్ అయితే అయ్యింది కనీసం ఏ అర్ధరాత్రో వదిలినా ఉదయానికి చల్లబడే వాళ్ళు. కానీ ఓజి వదిలేసి డివివి దానయ్య కొడుకు డెబ్యూ మూవీ అధీర గురించి అప్డేట్ ఇవ్వడం అభిమానులకు మరింత అసహనాన్ని కలిగిస్తోంది. ఎల్లుండి రాత్రి ప్రీమియర్లు పడుతుండగా ఇప్పటిదాకా ఓజి ట్రైలర్ లేకపోవడం పవన్ రేంజ్ స్టార్ హీరోకు ఎదురవ్వాల్సిన అనుభవమే కాదు. రెండు నిమిషాల వీడియోకే ఇంత సర్కస్ చేస్తే మరో ఫైనల్ మూవీని ఎలా మేనేజ్ చేశారనే సందేహం రావడం సహజం.
అయితే సినిమా ఎడిటింగ్, ట్రైలర్ కట్ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. రెండు వేర్వేరు ప్రక్రియలు. ఫైనల్ కాపీ సిద్ధమైతే దాన్నుంచి నాలుగు సీన్లు కత్తిరించేసి ట్రైలర్ చేయరు. చాలా విభాగాలు సమన్వయంతో పని చేస్తేనే బెస్ట్ అవుట్ ఫుట్ వస్తుంది. ఒకపక్క ఓవర్సీస్ కు పంపాల్సిన కాపీలు లేట్ అవుతుండటం, పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ వాటి డెలివరీలో బిజీగా ఉండటం వల్ల ట్రైలర్ మీద ఫుల్ లెన్త్ ఫోకస్ పెట్టడం సాధ్యం కాలేదన్నది యూనిట్ నుంచి వినిపిస్తున్న మాట. అసలే ట్రైలరే లేకుండా నేరుగా ఓజి రిలీజ్ చేసినా హైప్ తగ్గదు. వస్తుందని ఊరించడమే పరిస్థితిని ఇక్కడిదాకా తెచ్చిందనేది వాస్తవం.
This post was last modified on September 22, 2025 11:00 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…