హైదరాబాద్ ఎల్బి స్టేడియం అభిమాన సంద్రంతో పోటెత్తిపోయింది. ఓజి కన్సర్ట్ దెబ్బకు పవన్ కళ్యాణ్ తానో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిననే సంగతే కాసేపు మర్చిపోయారు. ఎప్పుడూ లేనిది మొదటిసారి తన సినిమా కాస్ట్యూమ్ తో ఈవెంట్ కి రావడంతో ఫ్యాన్స్ ఆనందం హద్దులు దాటేసింది. అది కూడా చేతిలో కాటన ఆయుధం పట్టుకుని చుట్టూ బాడీ గార్డ్స్, పైన గొడుగులు, భారీగా కురుస్తున్న తుంపర్ల మధ్య పవన్ స్టేజి మీద రావడం చూస్తే, రేపు స్క్రీన్ మీద చూపించే ఇంట్రో ఎలివేషన్ ఇంతకన్నా గొప్పగా ఉంటుందా అనే అనుమానం కలిగిందంటే ఆశ్చర్యం లేదు. సోషల్ మీడియాలో ఆ విజువల్స్ రచ్చ చేస్తున్నాయి.
స్పీచ్ లో సైతం పవన్ జోష్ మాములుగా లేదు. దర్శకుడు సుజిత్ వల్ల ఇలా ఓజాస్ గంభీరగా రావాల్సి వచ్చిందని, ఇలాంటి డైరెక్షన్ టీమ్ తనకు ఉండి ఉంటే పాలిటిక్స్ లో వచ్చే వాడిని కాదని చెప్పడం చూస్తే కంటెంట్ ఏ స్థాయిలో ఉందోనని ఫ్యాన్స్ అంచనాలు మరింత పెంచేసుకుంటున్నారు. ఈ సినిమా క్రెడిట్ మొదట సుజిత్, తర్వాత తమన్ కు చెందుతుందని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఖుషి తర్వాత మళ్ళీ అంతటి జోష్ ఇప్పుడే చూస్తున్నానని చెప్పడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. శ్రియ రెడ్డి, ప్రియాంక మోహన్, ఇమ్రాన్ హష్మీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి వాళ్ళ మీద పొగడ్తల వర్షం కురిపించారు.
వర్షం అంతకంతా పెరిగి పోవడంతో ఈవెంట్ అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది కానీ లేదంటే ఓజి సంబరం ఇంకో గంటకు పైగానే పీక్స్ కు చేరుకునేది. చినుకుల తాకిడి పెరగడం గమించిన పవన్ తన ప్రసంగాన్ని త్వరగా ముగించాల్సి వచ్చింది. తగ్గుతుందేమోనని చూసినప్పటికీ ఆ సూచనలు కనిపించలేదు. కొన్ని క్షణాల పాటు పవర్ కట్ కూడా ఇబ్బంది పెట్టింది. ఇంకొంచెం ముందుగా మొదలుపెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదేమో కానీ మొత్తానికి ఏది ఆశించి అన్ని వేల అభిమానులు ఈవెంట్ కు వచ్చారో దానికి రెట్టింపు ఒక్క పవన్ కళ్యాణ్ నుంచే వచ్చేసింది. ఇక మిగిలింది సెప్టెంబర్ 24 ప్రీమియర్ చూడటమే.
This post was last modified on September 21, 2025 9:35 pm
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా పడటం కేవలం వెంకటేష్ అభిమానులకే కాదు ఇతర హీరోలు, నిర్మాతలకు కూడా సంకటంగా…
ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమా రావాల్సిన డేటుకి శ్రీ విష్ణు సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రాబోతోంది. ఇది ఈ…
యష్ ఇమేజ్ నమ్ముకుని టాక్సిక్ ని డిస్ట్రిబ్యూట్ చేసిన దిల్ రాజు దాని వల్ల ఎలాంటి ప్రయోజనం పొందలేదు. పైపెచ్చు…
అగ్గిపెట్టి మచ్చా.. సోషల్ మీడియా వాడే తెలుగు వాళ్లకు ప్రత్యేకంగా ఈ పేరును పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతడి…
న్యాచురల్ స్టార్ నానికి ది ప్యారడైజ్ ఫలితం మంచి పాఠమయ్యింది. నైజామ్ వసూళ్ల వల్ల రికవరీ బాగానే జరిగినప్పటికీ అధిక…