మెగాస్టార్ చిరంజీవి సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానానికి గట్టి పోటీదారుగా నిలిచిన హీరో.. పవన్ కళ్యాణ్. బాక్సాఫీస్ రికార్డుల విషయంలో మహేష్ బాబుతో ఆయనకు గట్టి పోటీ ఉండేది. కొన్నేళ్ల పాటు వీరి మధ్యే ప్రధానంగా పోరు నడిచింది. కానీ సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లిపోయాక పవన్‌కు సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. ఎక్కువగా రీమేక్‌ల్లో నటిస్తూ మొక్కుబడిగా సినిమాల్లో కొనసాగాడు పవన్. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వాటి స్థాయిలో అవి బాగానే ఆడినా.. పవన్ పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
బ్రో, హరిహర వీరమల్లు చిత్రాలతో అభిమానులను మరింత డిజప్పాయింట్ చేశాడు పవన్. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన పవన్.. ఇప్పుడు వాటికి దూరంగా ఉండడం.. పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఏమాత్రం రుచించలేదు. ఐతే ‘ఓజీ’ సినిమాతో పవన్ అన్ని లెక్కలూ మార్చేయబోతున్నాడన్నది స్పష్టం.
పవన్ తన శైలికి, స్టామినాకు నప్పే యాక్షన్ ఫిలిం చేస్తే.. అది స్ట్రెయిట్ మూవీ అయితే.. దాన్ని ఒక ట్రెండీ డైరెక్టర్ తెరకెక్కిస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’ రుజువు చేస్తోంది. ఈ సినిమాకు రిలీజ్ ముంగిట హైప్ మామూలుగా లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజిలో జరుగుతున్నాయి. శనివారం నుంచే హైదరాబాద్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. తొలి రోజుకు చాలా షోలు నిమిషాల్లో సోల్డ్ ఔట్ అయిపోయాయి. మెజారిటీ షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లో ఉన్నాయి. వీకెండ్ మొత్తానికి బుకింగ్స్ మాంచి ఊపుమీద సాగుతున్నాయి.
ఏపీలో కూడా నెమ్మదిగా షోలు ఓపెన్ అవుతుండగా.. బుకింగ్స్ జోరుగానే జరుగుతున్నాయి. రెండు చోట్లా అదనపు రేట్లు, బెనిఫిట్ షోలు కూడా ఉన్నాయి కాబట్టి ఓపెనింగ్స్ మామూలుగా ఉండబోవని అర్థమవుతోంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత పవన్ మళ్లీ రికార్డుల వేటలోకి వస్తున్నాడు. డే-1, వీకెండ్ రికార్డుల్లో కచ్చితంగా కొన్ని బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ తర్వాత అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయిన పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు బయటికి వచ్చి.. కాలర్ ఎగరేసి సవాళ్లు విసురుతున్నారు. ‘ఓజీ’తో అందరికీ సమాధానం ఇస్తామని ధీమాగా చెబుతున్నారు.
This post was last modified on September 21, 2025 3:06 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…