Movie News

టికెట్లు ప్రత్యక్షం… క్షణాల్లో మటుమాయం

ఓజి బుకింగ్స్ మొదలైపోయాయి. ముఖ్యంగా తెలంగాణ అమ్మకాలు ర్యాంపేజ్ స్థాయిలో ఉన్నాయి. పెట్టడం ఆలస్యం క్షణాల్లో సోల్డ్ అవుట్ చూపిస్తున్నాయి. హైదరాబాద్ ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్న థియేటర్లలో సైతం ఫాస్ట్ ఫిల్లింగ్ ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రీమియర్ షోలు అందుబాటులోకి రాలేదు. రెగ్యులర్ షోలకే ఇంత డిమాండ్ ఉంది. క్రాస్ రోడ్స్ సింగల్ స్క్రీన్లలో అప్పర్ బాల్కనీ రేట్ 445 రూపాయలు ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పెంపు ఇచ్చింది వందే అయినప్పుడు ఇంత భారీ మొత్తం ఎలా పెట్టారనేది తెలియాల్సి ఉంది. మిగిలిన చోట్ల 275 రూపాయలు ఉంది.

ఇంకా మల్టీప్లెక్సుల షోలు జోడించలేదు. ఓజి టీమ్ ఈసారి ఎక్స్ క్లూజివ్ గా డిస్ట్రిక్ట్ యాప్ తో టైఅప్ కావడంతో ముందుగా అందులోనే టికెట్లు పెట్టారు. ఏపీలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అర్ధరాత్రి ఒంటి గంట షోకు వెయ్యి రూపాయల టికెట్లకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో ముందు రోజు రాత్రే షోలు వేస్తుండటంతో ఆంధ్రా డిస్ట్రిబ్యూటర్లు, ఫ్యాన్స్ అయోమయం చెందుతున్నారు. మార్పులు చేసిన కొత్త జిఓ రావొచ్చనే ప్రచారం నేపథ్యంలో మధ్య రాత్రి ఆటల బుకింగ్స్ ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేలేదు. పెట్టినవి ముక్క మిగలకుండా అయిపోయాయి.

ఇంకో అయిదు రోజులు సమయం ఉంది కాబట్టి ఈ షోలు, ఓపెనింగ్ రికార్డులు, థియేటర్ల పంపకాలకు సంబంధించి బోలెడు అప్డేట్స్ రాబోతున్నాయి. ఎలా చూసుకున్నా ఒకటి ముందు, ఒకటి వెనుక కాకుండా రెండు రాష్ట్రాల్లో 24 రాత్రి ఓజి బెనిఫిట్ షోలు ఉండటం పక్కానే. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఏపీ జిఓలో మిడ్ నైట్ షోల ప్రస్తావన వచ్చిందని, ఇప్పుడు తెలంగాణది చూశాక పూర్తి క్లారిటీ రావడంతో సవరణలు చేసి ఏ క్షణమైనా వదిలే అవకాశముందని వినికిడి. ట్రైలర్ రాకుండానే ఓజి ఇంత రచ్చ చేస్తోందంటే రేపు ఉదయం అసలు కంటెంట్ చూశాక అంచనాలు ఎక్కడికి వెళ్ళిపోతాయో వేచి చూడాలి.

This post was last modified on September 20, 2025 1:17 pm

Share

Recent Posts

కీర్తి సురేష్ భ‌లే సినిమా

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో క‌థానాయిక‌గా న‌టిస్తూనే.. ఇంకోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ మెరుస్తోంది కీర్తి సురేష్. మ‌హాన‌టి త‌ర్వాత…

1 hour ago

మాధ‌వ‌న్ గుండెలు గుబేల్‌

విజ‌య్ ముఖ్య‌మంత్రి అయ్యాక‌ త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ ఏం జ‌రిగినా ప‌రిస్థితి…

3 hours ago

సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది

తెలుగు ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకున్న బాలీవుడ్ న‌టుడు ప్ర‌దీప్ రావ‌త్ హ‌ఠాత్తుగా క‌న్ను మూశారు. 74 ఏళ్ల ఈ లెజెండ‌రీ…

5 hours ago

రిస్కుకు రెడీ అవుతున్న కనకరాజు

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో అందరి దృష్టి ఒక్క కొరియన్ కనకరాజు మీదే ఉంది. గత పది రోజులుగా…

7 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న బిక్షు యాదవ్

రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…

7 hours ago

ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చిన చంద్ర‌బాబు

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వ రెండేళ్ల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక ప‌రిస్థితిని ఆయ‌న వివ‌రించారు.…

8 hours ago