బాలీవుడ్ ఫ్రాంచైజ్ సినిమాల్లో ధూమ్ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న సిరీస్ జాలీ ఎల్ఎల్బి. పేరుకి కోర్ట్ రూమ్ డ్రామా అయినప్పటికీ ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్ రెండూ మిక్స్ చేసిన తీరు తొలి రెండు భాగాలను సూపర్ హిట్ చేశాయి. వీటిలో ఒకదాన్ని వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ తీయాలనుకుని తర్వాత డ్రాప్ అయ్యారు. దాన్నే సప్తగిరి చేయడం, యావరేజ్ ఫలితం అందుకోవడం వేరే విషయం. తాజాగా జాలీ ఎల్ఎల్బి 3 వచ్చింది. ఆడియన్స్ కి దీని మీద మంచి అంచనాలే ఉన్నాయి. అక్షయ్ కుమార్ ఫ్లాపుల పర్వానికి ఇది శుభం కార్డు వేస్తుందని అభిమానులు ఎదురు చూశారు. కానీ జరిగింది వేరు.
కథ పరంగా దర్శకుడు సుభాష్ కపూర్ మంచి పాయింటే తీసుకున్నారు కానీ దాన్ని డెవలప్ చేసే క్రమంలో పడిన తడబాటు దీన్నో మాములు మూవీగా మార్చేసింది. పచ్చని పొలాలున్న రైతుల నుంచి వ్యాపారం కోసం భూములు లాక్కున్న వ్యాపారవేత్త మీద చెట్టు కింద ప్లీడర్లు చేసే యుద్ధమే జాలీ ఎల్ఎల్బి 3. అక్షయ్ కుమార్, అర్షద్ వార్సి, గజ్ రాజ్, సౌరభ్ శుక్లా లాంటి ఆర్టిస్టులు తమ శాయశక్తులా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ వీక్ రైటింగ్ వల్ల చాలా సన్నివేశాలు తేలిపోయాయి. కొన్ని ఎపిసోడ్లు బాగున్నప్పటికీ ఓవరాల్ గా సినిమా బాగుందని చెప్పడానికి ఎంత మాత్రం సరిపోలేదు.
ఎలాంటి అంచనాలు లేకుండా జాలీ ఎల్ఎల్బి 3 చూస్తే కనీసం యావరేజ్ అనిపిస్తుంది. ఆలా కాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ ని దృష్టిలో పెట్టుకుని ఏదేదో ఊహించుకుంటే మాత్రం నిరాశ తప్పదు. ముఖ్యంగా ఎమోషన్లకు కీలకమైన రైతు బ్యాక్ డ్రాప్ ని హ్యాండిల్ చేసిన తీరు పరమ నీరసంగా, రొటీన్ గా అనిపిస్తుంది. బాధితుల బాధను ఆడియన్స్ అర్థం చేసుకోలేనప్పుడు కోర్టులో నడిచే వాదోపవాదాలు కనెక్ట్ కావు. జాలీ ఎల్ఎల్బి 3లో జరిగింది ఇదే. ఎంత రొటీన్ గా ఉన్నా పర్వాలేదనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు కానీ ఈ క్రేజీ లాయర్ మూడో భాగం మాత్రం అంచనాలు అందుకోలేక చతికిలబడింది.
This post was last modified on September 20, 2025 11:58 am
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…