తెలుగు చిత్ర సీమకు రెండు కళ్లుగా నిలిచిపోయిన లెజెండరీ నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. ఇప్పటి తరానికి వీళ్ళ గొప్పదనం తెలియాలంటే చేతిలో ఉన్న ఏకైక మార్గం బయోపిక్. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు స్వయంగా బాలకృష్ణే చేసినా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. టైమింగ్ మిస్సయ్యిందో లేక చరిత్రను చెప్పే క్రమంలో దర్శకుడు క్రిష్ తడబడ్డారో కారణం ఏదైతేనేం అభిమానులు నిరాశపడ్డారు. ఓటిటిలో చూసినప్పుడు బాగానే అనిపించే ఎన్టీఆర్ ఆత్మకథ థియేటర్లలో ఆడకపోవడానికి ప్రధాన కారణంలో మహానటిలో నాగ అశ్విన్ పండించిన డ్రామా క్రిష్ మిస్ చేయడమే.
దీని సంగతలా ఉంచితే అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ ఆలోచనలో ఉన్నారు నాగార్జున. ఎవరు బాగా రాయగలరనే దాని గురించి చర్చలు జరుగుతున్నాయని, ఎవరు బాగా తీస్తారని కసరత్తు కొలిక్కి వచ్చాక వివరాలు చెబుతానని అన్నారు. నిజంగా తీసే పనైతే మాత్రం నాగ్ చేతిలో పెద్ద రిస్క్ ఉంటుంది. ఎందుకంటే ఏఎన్ఆర్ లైఫ్ లో విపరీతమైన నాటకీయత లేదు. పుస్తకాల్లో అద్భుతం అనిపించే సంఘటనలు బోలెడు ఉన్నాయి కానీ వాటిని స్క్రీన్ మీద కన్వర్ట్ చేసి ఆడియన్స్ స్పెల్ బౌండ్ అయ్యేలా చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. కనిపించని సూదితో దారం ఎక్కించినంత సంక్లిష్టం.
గతంలో ఇదే టాపిక్ మీద నాగార్జున మాట్లాడుతూ నాన్న జీవితాన్ని స్క్రీన్ మీద చూపించడం కష్టమనే తరహాలో చెప్పారు. కానీ ఇప్పుడు నిర్ణయం మారినట్టు ఉంది. కాకపోతే ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు ఫెయిలయ్యిందో విశ్లేషించుకుని అవి మళ్ళీ రిపీట్ కాకుండా జాగ్రత్త పడాలి. ఏఎన్ఆర్ గా నాగార్జున చేయకపోవచ్చు. సుమంత్ బెటర్ ఆప్షనవుతారని ఫ్యాన్స్ ఫీలింగ్. లేదా నాగ చైతన్య కూడా ట్రై చేయొచ్చు. ఇదంతా కార్యరూపం దాల్చడానికి చాలా టైం పట్టేలా ఉంది. అక్కినేని 101 జయంతి నిర్వహిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్ ప్రేమాభిషేకం, డాక్టర్ చక్రవర్తి సినిమాలను పలుచోట్ల ఉచితంగా ప్రదర్శిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates